ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections: పంజాబ్‌లో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన ఆప్

ABN, Publish Date - Apr 16 , 2024 | 02:43 PM

పంజాబ్‌లో నలుగురు లోక్‌సభ అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం ప్రకటించింది. ఫిరోజ్‌పూర్ నుంచి జగదీప్ సింగ్ కాక బ్రార్, గురుదాస్‌పూర్ నుంచి అమన్‌షేర్ సింగ్, జలంధర్‌ నుంచి పవన్ కుమార్ టిను, లూథియానా నుంచి అశోక్ పరాశర్ పప్పీ‌లను ఎన్నికల బరిలో దింపుతున్నట్లు తెలిపింది.

చంఢీగడ్, ఏప్రిల్ 16: పంజాబ్‌లో నలుగురు లోక్‌సభ అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం ప్రకటించింది. ఫిరోజ్‌పూర్ నుంచి జగదీప్ సింగ్ కాక బ్రార్, గురుదాస్‌పూర్ నుంచి అమన్‌షేర్ సింగ్, జలంధర్‌ నుంచి పవన్ కుమార్ టిను, లూథియానా నుంచి అశోక్ పరాశర్ పప్పీ‌లను ఎన్నికల బరిలో దింపుతున్నట్లు తెలిపింది.

Ramdev Baba: మీరంత అమాయకులేం కాదు.. రాందేవ్‌పై సుప్రీం ఫైర్

అయితే జగదీప్, అమన్‌షేర్, అశోక‌్ ముగ్గురు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారని వివరించింది. ఇక అశోక్ పరాశర్ పప్పీ మాత్రం మాజీ ఎమ్మెల్యే అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

Bangalore: దుమారం రేపిన మాజీసీఎం కుమారస్వామి వ్యాఖ్యలు..

ముక్త్సార్ ఎమ్మెల్యేగా బ్రార్, బాటాల ఎమ్మెల్యేగా కల్సీ, లూథియానా సెంట్రల్ ఎమ్మెల్యేగా పప్పీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పవన్ కుమార్ టిను ఇటీవల శిరోమణి అకాలీదళ్‌కి రాజీనామా చేసి.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ నలుగురు అభ్యర్థుల ప్రకటనతో పంజాబ్‌లోని ఆప్ పార్టీ మొత్తం 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది. మరోవైపు ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది.


అయినప్పటికీ.. పంజాబ్‌లో మాత్రం ఆప్ స్వతంత్రంగా బరిలో దిగుతతోంది. పంజాబ్‌లో చివర విడతలో అంటే జూన్ 1వ తేదీన లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో లోక్ సభ ఎన్నికల్లో సైతం పంజాబ్‌లో సత్తా చాటాలని ఆమ్ ఆద్మీ పార్టీ కృత నిశ్చయంతో ఉంది. అందుకోసం ఆ పార్టీ ప్రచారంలో ముందుకు వెళ్తుంది.

జాతీయ వార్తలు కోసం...

Updated Date - Apr 16 , 2024 | 03:24 PM

Advertising
Advertising