ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Devotees: భక్తుల నడక మార్గంలో ప్రమాదం.. ముగ్గురు మృతి, మరో 8 మందికి గాయాలు

ABN, Publish Date - Jul 21 , 2024 | 11:22 AM

భక్తుల(devotees) నడక మార్గంలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం చోటుచేసుకుంది. కేదార్‌నాథ్(Kedarnath) చిర్బాస సమీపంలో కొండపై నుంచి అకస్మాత్తుగా భారీ మొత్తంలో శిథిలాలు, బండరాళ్లు పడిపోయాయి. దీంతో అదే సమయంలో యాత్రకు వెళ్తున్న వారిలో ముగ్గురు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

Kedarnath landslides

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని గౌరీకుండ్-కేదార్‌నాథ్(Kedarnath) భక్తుల(devotees) నడక మార్గంలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం చోటుచేసుకుంది. చిర్బాస సమీపంలో కొండపై నుంచి అకస్మాత్తుగా భారీ మొత్తంలో శిథిలాలు, బండరాళ్లు పడిపోయాయి. దీంతో అదే సమయంలో యాత్రకు వెళ్తున్న వారిలో ముగ్గురు భక్తులు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ఉదయం 7:30 గంటల సమయంలో సమాచారం అందిందని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ తెలిపారు. ఈ సమాచారం అందిన వెంటనే భద్రతా సిబ్బంది ఎన్‌డిఆర్‌ఎఫ్, డీడీఆర్‌ఎఫ్, వైఎంఎఫ్, పరిపాలన బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.


నదిలో

శిథిలాల నుంచి ముగ్గురిని రెస్క్యూ టీమ్ బయటకు తీసిందని, వారు మరణించారని ఆయన చెప్పారు. కాగా, గాయపడిన ఓ వ్యక్తిని రక్షించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత ఏడాది ఆగస్టు నెలలో కూడా గౌరీకుండ్‌లో(gaurikund) పెద్ద ప్రమాదం జరిగింది. కొండ కూలిపోవడంతో మూడు దుకాణాలు నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందారు. చాలా మంది అదృశ్యమయ్యారు. మందాకిని నదిలో దాదాపు డజను మంది మృతదేహాలను వెలికితీశారు.


భారీ వర్షాలు

జులై 21, 22 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు(rains) కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో నైనిటాల్, ఉధమ్ సింగ్ నగర్, చంపావత్, పౌరీలలో వర్షం పడుతుందని రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఉత్తరాఖండ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున కొండలపై నుంచి మరిన్ని రాళ్లు పడే అవకాశం ఉంది. దీంతోపాటు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లనున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ఇవి కూడా చదవండి:

Chandipura Virus: పెరుగుతున్న చండీపురా వైరస్ కేసులు.. ఇప్పటికే 16 మంది మృతి


Paris Olympics 2024: మరికొన్ని రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్.. ఈసారి భారత్ నుంచి గతంలో కంటే..


Budget 2024: బడ్జెట్‌ 2024 నేపథ్యంలో పెరగనున్న స్టాక్స్ ఇవే..!


More National News and Latest Telugu News

Updated Date - Jul 21 , 2024 | 11:26 AM

Advertising
Advertising
<