స్పెషల్ టూల్‌కిట్‌తో ప్రశ్నపత్రం పెట్టె తెరిచారు
ABN, Publish Date - Oct 08 , 2024 | 04:00 AM
దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ యూజీ- 2024 పేపర్ లీక్ వ్యవహారంలో సీబీఐ సోమవారం మూడో చార్జిషీటు దాఖలు చేసింది.
నీట్ పేపర్ కోసం 144 మంది డబ్బు చెల్లించారు: సీబీఐ
న్యూఢిల్లీ, అక్టోబరు 7: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ యూజీ- 2024 పేపర్ లీక్ వ్యవహారంలో సీబీఐ సోమవారం మూడో చార్జిషీటు దాఖలు చేసింది. నీట్ పేపర్ కోసం 144 మంది భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు పేర్కొంది. పరీక్ష జరగడానికి కొద్ది గంటల ముందే ఝార్ఖండ్ హజారీబాగ్‌లోని ఒయాసిస్ పాఠశాల నుంచి పంకజ్ కుమార్ అనే వ్యక్తి ప్రశ్నపత్రాన్ని దొంగిలించినట్లు పేర్కొంది. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ సహకారంతో పేపర్ బయటకొచ్చినట్లు చార్జిషీటులో పేర్కొంది.
పంకజ్ కుమార్ ప్రత్యేకమైన టూల్‌కిట్‌తో ప్రశ్నపత్రాల పెట్టెను తెరిచి ఒక దాన్ని ఫోటో తీసుకుని అనంతరం పెట్టెలో పెట్టి యథావిధిగా సీల్ చేశాడని తెలిపింది. బయటకు వచ్చిన తర్వాత దాన్ని ప్రధాన నిందితుడికి పంపినట్లు వెల్లడించింది. అతడు డబ్బులు చెల్లించిన వ్యక్తులకు ప్రశ్నపత్రాన్ని చేరవేసినట్లు తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 49 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారిలో 40 మందిపై చార్జిషీటు దాఖలు చేశామని సీబీఐ పేర్కొంది.
Updated Date - Oct 08 , 2024 | 04:00 AM