దర్శన్ బెయుల్‌పై విచారణ నేటికి వాయిదా
ABN, Publish Date - Oct 29 , 2024 | 04:18 AM
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడు, నటుడు దర్శన్ బెయిల్ పిటిషన్ విచారణ మంగళవారానికి వాయిదా పడింది.
బెంగళూరు, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడు, నటుడు దర్శన్ బెయిల్ పిటిషన్ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. బళ్లారి జైలులో ఉన్న దర్శన్ తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఇందుకు వెంటనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని దర్శన్ తరఫు న్యాయవాదులు ఇదివరకే కోర్టు దృష్టికి తెచ్చారు. దర్శన్ మెడికల్ రిపోర్టును సమర్పించాలని వారికి హైకోర్టు సూచించింది. దీంతో బళ్లారి జైలు అధికారులు దర్శన్ ఎంఆర్‌ఐ రిపోర్టును సోమవారం కోర్టుకు సమర్పించారు. దర్శన్ తరఫు న్యాయవాది సీవీ నాగేశ్ వాదనలు వినిపిస్తూ, రక్తం సరఫరా సజావుగా లేదని, పెరాలసిస్ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపారు. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని విన్నవించారు. తదుపరి విచారణను హైకోర్టు మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.
Updated Date - Oct 29 , 2024 | 04:18 AM