ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Taj Mahal Video: తాజ్‌మహల్‌ ప్రధాన డోమ్ లీక్.. చుట్టుముట్టిన వరద

ABN, Publish Date - Sep 14 , 2024 | 04:48 PM

ప్రపంచంలో ఏడో వింత తాజ్ మహల్‌. అలాంటి సుందర కట్టడం తాజ్ మహల్‌ను వరద చుట్టుముట్టింది. ప్రధాన డోమ్ లీక్ అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. మరమ్మతులు చేపడుతామని ప్రకటించారు.

ఢిల్లీ: ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ (Taj Mahal) కట్టడాన్ని వరద చుట్టుముట్టింది. తాజ్ మహల్ ప్రధాన డోమ్ కూడా లీక్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రాలో గడిచిన మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు 17వ శతాబ్దపు అద్భుత కట్టడం, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద, ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్‌ ప్రధాన డోమ్‌ వద్ద నీరు లీక్‌ అవుతోంది. భారీ వర్షం ధాటికి వరదంతా తాజ్‌మహల్‌ ఆవరణలోని తోటలో నిలిచిపోయింది.

దీంతో అది చిన్నపాటి చెరువును తలపిస్తోంది. ప్రధాన డోమ్‌పై వాటర్ లీక్ అయినప్పటికీ డోమ్‌కు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పక్కనే ఉన్న గార్డెన్ మొత్తం నీటిలో మునిగిపోయినప్పటికీ తాజ్ మహల్‌‌ పునాదులకు ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. కట్టడాన్ని పరిశీలించడం కోసం డ్రోన్ కెమెరాలను ఉపయోగించామని ఆగ్రా సర్కిల్‌ ఆర్కియాలజీ అధికారి రాజ్‌కుమార్ పటేల్ చెప్పారు.


‘‘తాజ్ మహల్ ప్రధాన డోమ్‌లో లీకేజీ ఉన్నట్లు గుర్తించాం. వరుసగా వర్షాలు పడుతుండటంతో తాజ్‌మహల్ గోడలను చెమ్మ ఆవరించింది. దీంతోనే లీకేజీ అవుతున్నట్లు గుర్తించాం. ప్రధాన డోమ్‌కు ఎలాంటి నష్టం జరగలేదు. డ్రోన్ కెమెరాలను ఉపయోగించి పరిశీలించాం’’ అని రాజ్‌కుమార్ చెప్పారు. పగుళ్లు వచ్చే డోమ్‌పై చెమ్మ ఏర్పడుతోందని గతంలో ఓ అధికారి తెలిపారు. తాజ్‌మహల్ లీకేజీ సమస్యను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన అధికారుల బృందం పరిశీలిస్తోంది. బయట ఉన్న గార్డెన్ వరద నీటిలో మునిగిపోయిన విజువల్స్‌ను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఎంతో ప్రఖ్యాతిగాంచిన చారిత్రక కట్టడాన్ని కాపాడుకోవాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

For Latest News and National News click here

Updated Date - Sep 14 , 2024 | 05:54 PM

Advertising
Advertising