ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bengaluru: కర్ణాటక కాంగ్రెస్‌లో వింత పరిస్థితి.. ఎంపీ ఎన్నికల్లో పోటీకి నో అంటున్న నేతలు.. ఎందుకంటే

ABN, Publish Date - Mar 07 , 2024 | 07:40 PM

కర్ణాటక కాంగ్రెస్‌లో(Congress) ప్రస్తుతం వింత పరిస్థితి నెలకొంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించడంతో కర్ణాటకలోనూ అత్యధిక ఎంపీ స్థానాల్లో పాగా వేస్తామని అప్పట్లో నేతలు ధీమా వ్యక్తం చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ నేతలెవరూ పోటీ చేయడానికి ముందడుగు వేయట్లేదని పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది.

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో(Congress) ప్రస్తుతం వింత పరిస్థితి నెలకొంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించడంతో కర్ణాటకలోనూ అత్యధిక ఎంపీ స్థానాల్లో పాగా వేస్తామని అప్పట్లో నేతలు ధీమా వ్యక్తం చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ నేతలెవరూ పోటీ చేయడానికి ముందడుగు వేయట్లేదని పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను వెతుక్కోలేక కాంగ్రెస్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంతరాష్ట్రం అయినా.. ఆయనా పోటీకి ఆసక్తి చూపట్లేదు. పలువురు మంత్రులు కూడా పోటీకి ససేమిరా అంటున్నారు.

అయితే అధికార పదవులు వదిలి అనిశ్చితిలో ఉండాలని ఎవరు కోరుకుంటారని ఓ కాంగ్రెస్ నేత చెప్పడం.. పరిస్థితికి అద్దం పడుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ ఒకటి, జనతాదళ్ సెక్యులర్ ఒక సీటు గెలుచుకుంది. ఒక సీటు ఇండిపెండెంట్‌కు దక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించడంతోపాటు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు మంచి స్పందన రావడంతో ఎంపీ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని కాంగ్రెస్ భావిస్తోంది.


రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాల్లో కొన్నింటిలో మంత్రులు పోటీ చేయాలని పార్టీ కేంద్ర నాయకత్వం కోరుతున్నట్లు తెలిసింది. అధిష్టానం చెబుతున్న జాబితాలో మంత్రులు సతీష్ జార్కిహోళి, బి నాగేంద్ర, కృష్ణ బైరేగౌడ, కెహెచ్ మునియప్ప, హెచ్‌కె పాటిల్, ఈశ్వర్ ఖండ్రే ఉన్నారు. మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి హెబ్బాల్కర్ తన కుమారుడు మృణాల్ హెబ్బాల్కర్‌కు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మహదేవప్ప ఎటువంటి కారణం చెప్పకుండా లోక్ సభ పోటీని సున్నితంగా తిరస్కరించారు.

తాను లోక్‌సభ అభ్యర్థిని కాదని.. ఎన్నికల్లో పోటీ చేయబోనని.. హైకమాండ్ ఎవరికి టికెట్ ఇస్తే వారి గెలుపు కోసం ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. ఈ విషయంలో పార్టీ కఠిన వైఖరి అవలంబించబోతోందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ అంగీకరించాల్సిందే, పార్టీ వల్లే తామంతా ఇక్కడ ఉన్నామని కలిసికట్టుగా ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కుంటామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఒక మంత్రిని మాత్రమే పోటీ చేయమని అడిగామని.. అందరినీ సంప్రదించలేదన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 07:40 PM

Advertising
Advertising