ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: రాజ్యసభ నుంచి వాకౌట్‌పై ఖర్గే స్పష్టత..

ABN, Publish Date - Jul 03 , 2024 | 02:54 PM

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని రాజ్యసభ బుధవారం ఆమోదించింది. ఈ తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతుండగా.. ప్రతిపక్ష నాయకుడు ఖర్గేను మాట్లాడనివ్వాలంటూ ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.

Kharge

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని రాజ్యసభ బుధవారం ఆమోదించింది. ఈ తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతుండగా.. ప్రతిపక్ష నాయకుడు ఖర్గేను మాట్లాడనివ్వాలంటూ ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. మోదీ సభలో అవాస్తవాలు చెబుతున్నారంటూ చివరకు సభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ప్రధాని మోదీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సైతం కొనసాగింది. వాస్తవాలు మాట్లాడటం లేదని విపక్షాలు అంటే.. నిజం వినే ధైర్యం విపక్షాలకు లేదంటూ మోదీ కౌంటర్‌ ఇచ్చారు. దీనిపై మల్లికార్జున్‌ ఖర్గే స్పందించారు. తాము ఎందుకు వాకౌట్ చేయాల్సి వచ్చిందో ఆయన వివరణ ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని సభలో మాట్లాడుతున్న సమయంలో కొన్ని అవాస్తవాలు చెప్పారని.. దానికి నిరసనగా వాకౌట్ చేశామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అబద్ధాలు చెప్పడం మోదీకి అలవాటుగా మారిందన్నారు. రాజ్యాంగానికి బీజేపీ వ్యతిరేకమని మరోసారి ఖర్గే పేర్కొన్నారు.

Rajyasabha Updates: విపక్షాలకు ఎప్పటికీ అర్థంకాదు.. రాజ్యసభలో మోదీ సెటైర్లు..


ఆ రాజ్యాంగానికి వ్యతిరేకం-ఖర్గే

తాము ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించామని, దానికి తాము ఎప్పుడూ వ్యతిరేకమేనని ఖర్గే అన్నారు. బీఆర్ అంబేద్కర్‌ను పండిట్ నెహ్రూ అవమానించారని పదేపదే చెబుతున్నారని.. నిన్న లోక్‌సభలో ఈ విషయమే చెప్పారని, ఈరోజు రాజ్యసభలో అదే చెబుతున్నారన్నారు. రాజ్యాంగ సభలో బాబాసాహెబ్ ఏం చెప్పారో, ఆర్‌ఎస్‌ఎస్ ఆర్గనైజర్‌లో ఏం రాసిందో తాను చెప్పాలనుకున్నానని.. సభలో మాట్లాడేందుకు చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌ను అభ్యర్థించినప్పటికీ తమకు అవకాశం ఇవ్వలేదన్నారు.

PM Narendra Modi: అబద్ధాలు.. పిల్లచేష్టలు!


ఖర్గేను గౌరవించలేదు - పవార్

రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్‌పై ఎన్సీపీ(SP) అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ మల్లికార్జున్ ఖర్గే రాజ్యాంగబద్ధమైన పదవిని నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి అయినా, సభాపతి అయినా.. ప్రతిపక్షనేతను గౌరవించాలన్నారు. ఇవాళ సభలో ప్రతిపక్షానికి గౌరవం దక్కలేదని అందుకే విపక్షాలు సభను వాకౌట్ చేశాయన్నారు.


Hathras: హత్రాస్‌ తొక్కిసలాట ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం.. నేడు సీఎం కూడా..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 03 , 2024 | 02:54 PM

Advertising
Advertising