ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Air Canada: అంతర్జాతీయ విమానానికి బాంబు బెదిరింపు.. తీరా చూస్తే అదే ట్విస్ట్

ABN, Publish Date - Jun 05 , 2024 | 03:12 PM

‘నాన్న-పులి’ కథ అందరికీ గుర్తుండే ఉంటుంది. తండ్రిని ఆట పట్టించడం కోసం పొలంలో పులి రాకపోయినా.. ‘పులి వచ్చింది’ అంటూ కొడుకు అబద్ధం చెప్తాడు. ఇప్పుడు విమానయాన..

Air Canada Delhi-Toronto Flight Gets Bomb Threat

‘నాన్న-పులి’ కథ అందరికీ గుర్తుండే ఉంటుంది. తండ్రిని ఆట పట్టించడం కోసం పొలంలో పులి రాకపోయినా.. ‘పులి వచ్చింది’ అంటూ కొడుకు అబద్ధం చెప్తాడు. ఇప్పుడు విమానయాన సంస్థలతోనూ కొందరు దుండగులు ఇలాంటి ఆటలే ఆడుతున్నారు. తెరవెనుక ఎవరున్నాయో తెలియడం లేదు కానీ.. విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threats) రావడం ఈమధ్య సర్వసాధారణం అయిపోయింది. సరిగ్గా టేకాఫ్ సమయంలో ఫలానా విమానంలో బాంబు ఉందని ఫోన్ లేదా మెయిల్ రావడం, తీరా చూస్తే అదంతా అబద్ధమని తేలడం.. వంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఎయిర్ కెనడా (Air Canada) విమానానికి కూడా ఇలాంటి ఫేక్ కాల్ రావడం ఆందోళనకరంగా మారింది.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఎయిర్ కెనడాకు చెందిన ఓ విమానం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి టొరంటోకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. కానీ.. రాత్రి 10:50 గంటలకు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఆఫీస్‌కు ఒక బెదిరింపు మెయిల్ వచ్చింది. ఢిల్లీ-టొరంటో విమానంలో ఒక బాంబుని అమర్చారని అందులో పేర్కొని ఉంది. దీంతో.. సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌లో భాగంగా అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కానీ.. ఎంత వెతికినప్పటికీ అనుమానాస్పదంగా ఏదీ దొరకలేదు. దీంతో.. తమకు వచ్చిన మెయిల్ ఫేక్ అని అధికారులు తేల్చారు. ప్రస్తుతం ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? అనే విషయంపై దర్యాప్తు చేపట్టారు.


కాగా.. ఈమధ్య కాలంలో ఇలాంటి బెదిరింపులు ఎక్కువైపోయాయి. జూన్ 3వ తేదీన ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరిన అకాసా విమానానికి కూడా బాంబు బెదిరింపులు రాగా.. ఉన్నపళంగా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకి డైవర్ట్ చేయడం జరిగింది. ఈ బెదిరింపులు రాగానే.. విమానంలో ఉన్న 187 మంది ప్యాసింజర్లు భయాందోళనలకు గురయ్యారు. దీంతో గందరగోళ వాతావరణం నెలకొంది. తీరా తనిఖీ చేస్తే అదొక ఫేక్ కాల్ అని తేలింది. అంతకుముందు చెన్నైలోని ఇండిగో ఫ్లైట్‌కి, శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విస్తారా విమానానికి ఇటువంటి తప్పుడు బెదిరింపులే వచ్చాయి. ఈ క్రమంలోనే విమానయాన సంస్థలు ఈ ఫేక్ కాల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 05 , 2024 | 03:12 PM

Advertising
Advertising