Air India: ఊపిరి పీల్చుకున్న ఎయిర్ ఇండియా... విధుల్లో చేరిన సిబ్బంది
ABN, Publish Date - May 12 , 2024 | 06:52 PM
సామూహిక సిక్ లీవ్‌లో ఉన్న ఎయిర్ ఇండియా (Air India) సిబ్బంది తిరిగి విధుల్లో చేరినట్టు ఆ సంస్థ అధికారి ఒకరు ఆదివారంనాడు తెలిపారు. విమాన సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని, ఈనెల14వ తేదీ నుంచి అన్ని సర్వీసులు యథాప్రకారం నడుస్తాయని చెప్పారు.
న్యూఢిల్లీ: సామూహిక సిక్ లీవ్‌లో ఉన్న ఎయిర్ ఇండియా (Air India) సిబ్బంది తిరిగి విధుల్లో చేరినట్టు ఆ సంస్థ అధికారి ఒకరు ఆదివారంనాడు తెలిపారు. విమాన సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని, ఈనెల14వ తేదీ నుంచి అన్ని సర్వీసులు యథాప్రకారం నడుస్తాయని చెప్పారు.
''సిక్ లీవులో ఉన్న సిబ్బంది మే 11వ తేదీన విధుల్లో చేరారు'' అని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే కంపెనీ షెడ్యూల్డ్ సాఫ్ట్‌వేర్‌లో లోపం కారణంగా స్టాఫ్ సిక్ లీవులో ఉన్నట్టు చూపుతోందని పేర్కొంది. ప్రతిరోజూ సుమారు 380 విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా నడుపుతుండగా, ఆదివారంనాడు సుమారు 20 విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ఎయిర్‌లైన్స్ నిర్వహణాలోపాల కారణంగా సిబ్బంది సమ్మెకు దిగడంతో గత మంగళవారం నుంచి వందలాది విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. దీంతో సయోధ్య కుదిర్చేందుకు చీఫ్ లేబర్ కమిషనర్ గురువారంనాడు న్యూఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. సిబ్బంది సమ్మె విరమణకు అంగీకరించగా, ఎయిర్‌లైన్స్ సైతం 25 మంది సిబ్బందికి జారీ చేసిన టెర్మినేషన్ లేఖలను ఉపసంహరించుకునేందుకు ఒప్పుకుంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Read Latest National News and Telugu News
Updated Date - May 12 , 2024 | 06:52 PM