Delhi Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. పడిపోయిన గాలి నాణ్యత..
ABN, Publish Date - Oct 19 , 2024 | 09:34 AM
ప్రతి ఏడాది చలికాలంలో ఢిల్లీ వాసులు తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఈ ఏడాది మరింత ముందుగానే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. దీపావళి పండుగకు ముందే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
ఢిల్లీ (Delhi) వాసులకు దీపావళికి ముందే కష్టకాలం మొదలైంది. ప్రతి ఏడాది చలికాలంలో ఢిల్లీ వాసులు తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఈ ఏడాది మరింత ముందుగానే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. దీపావళి పండుగకు ముందే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎయిర్ క్వాలిటీ (Air Quality) ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి (Central Pollution Control Board) పేర్కొంది. తాజాగా ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 334గా నమోదైనట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది (Delhi Air Pollution).
చలి తీవ్రత పెరగడం, వాయు వేగం తగ్గడంతో ఢిల్లీ, చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి తగ్గిపోతోంది. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనం వల్ల రాజధాని నగరం ఢిల్లీని పొగ అలిమేస్తోంది. దీంతో రాజధాని ప్రాంత ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కళ్ళ మంటలు, గొంతు నొప్పి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం.. ఘజియాబాద్‌లో 265, నోయిడాలో 243, గ్రేటర్ నోయిడాలో 228 సహా పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత అధ్వానంగా ఉంది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉందని, కాలుష్యం లేదని అర్థం. AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని, ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత లేదని, ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు. ఈ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే.. ఇంకా, చలికాలం మొదలు కాకముందే ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళనకర స్థితికి చేరుకోవడం చాలా మందిని కలవరపెడుతోంది.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Oct 19 , 2024 | 09:34 AM