ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Alcohol: అబ్బో.. మార్చిలో మనోళ్లు తెగ తాగేశారుగా.. రికార్డు స్థాయిలో రూ.4,475 కోట్ల అమ్మకాలు

ABN, Publish Date - Apr 04 , 2024 | 10:21 AM

మార్చిలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. ఈ నెలలో ఏకంగా రూ.4,475 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. మందుబాబులు ప్రతి రోజూ 12 లక్షల బాటిళ్ల బీర్‌ను సేవించారు. ఈ విక్రయాలు ఏప్రిల్‌లో మరింత పెరిగే అవకాశం ఉందని టాస్మాక్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

- ప్రతి రోజూ 12 లక్షల బీర్లు విక్రయం

చెన్నై: మార్చిలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. ఈ నెలలో ఏకంగా రూ.4,475 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. మందుబాబులు ప్రతి రోజూ 12 లక్షల బాటిళ్ల బీర్‌ను సేవించారు. ఈ విక్రయాలు ఏప్రిల్‌లో మరింత పెరిగే అవకాశం ఉందని టాస్మాక్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. గత నెల మూడో వారంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆ తర్వాత అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు, ప్రచారం వంటి కార్యక్రమాల్లో ద్వితీయశ్రేణి నేతలతో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. వీరికి రోజువారీ ఖర్చుల కింద కొంత నగదునే చేతికి ఇస్తూనే బిర్యానీ ప్యాకెట్‌, మద్యాన్ని అభ్యర్థులు అందిస్తున్నారు. దీంతో మద్యం విక్రయాలు మార్చి నెల మూడో వారం నుంచి క్రమంగా ఊపందుకున్నాయి. నెలాఖరుకు ఈ ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో మార్చిలో రూ.4,475 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. మొత్తం 87 లక్షల బాక్సుల మద్యం అమ్ముడు పోయింది. మార్చిలో బీర్‌ బాటిళ్ళు మాత్రమే 32.72 లక్షల కేస్‌లు విక్రమయ్యాయి.

ఇదికూడా చదవండి: తమిళనాట త్రిముఖ పోరు

అంటే ప్రతి రోజూ సగటున 12 లక్షల బాటిళ్ళ బీర్లు విక్రమయ్యాయి. ఈ విక్రయాలు ఫిబ్రవరిలో 26.93 లక్షలుగా (రోజుకు 24.40 లక్షల బీర్లు) ఉన్నాయి. మార్చిలో మొత్తం 55.07 లక్షల కేస్‌ల మద్యం విక్రయమైంది. ఫిబ్రవరిలో ఇది 47.34 లక్షలుగా ఉంది. జనవరిలో 57 లక్షలుగా ఉందని టాస్మాక్‌ అధికారులు తెలిపారు. మొత్తం 12 బాటిళ్ళు ఉన్న ఒక బాక్సు ధర సగటున రూ.1900, 48 క్వార్టర్‌ మద్యం బాటిళ్లు కలిగిన ఒక బాక్సు రూ.7 వేలుగా ఉంది. ఈ గణాంకాల చొప్పున రూ.621 కోట్లకు బీరు, రూ.3,854 కోట్లకు వివిధ రకాల మద్యం అమ్ముడు పోయింది. ఫిబ్రవరిలో రూ.511 కోట్లకు బీరు, ఇతర మద్యం రకాల విక్రయాలు రూ.3,313గా ఉంది. ఈ విక్రయాలు ఏప్రిల్‌లో మరింతగా పెరిగే అవకాశం ఉందని టాస్మాక్‌ అధికారులు తెలిపారు.

ఇదికూడా చదవండి: బీజేపీలో చేరుతున్నా: సుమలత

Updated Date - Apr 04 , 2024 | 10:29 AM

Advertising
Advertising