ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sajeed Wajed: అవన్నీ పుకార్లేనన్న బంగ్లా మాజీ ప్రధాని కుమారుడు

ABN, Publish Date - Aug 10 , 2024 | 10:37 AM

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వీసా రద్దు కావడంతో పాటు ఆమె రాజకీయ ఆశ్రయం పొందలేదని వస్తున్న వార్తలపై ఆమె కుమారుడు సాజీబ్ వాజెద్ జాయ్ స్పందించారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాజెద్ మాట్లాడుతూ.. తన తల్లికి భద్రత కల్పించినందుకుక భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వీసా రద్దు కావడంతో పాటు ఆమె రాజకీయ ఆశ్రయం పొందలేదని వస్తున్న వార్తలపై ఆమె కుమారుడు సాజీబ్ వాజెద్ జాయ్ స్పందించారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాజెద్ మాట్లాడుతూ.. తన తల్లికి భద్రత కల్పించినందుకుక భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. షేక్ హసీనా వీసాను ఎవరూ రద్దు చేయలేదని, అవన్నీ కేవలం పుకార్లేనని పేర్కొన్నారు. నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని కొత్త బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై కూడా వాజెద్ విమర్శలు గుప్పించారు. ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమని.. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి సత్వర ఎన్నికలు అవసరమని వాజెద్ స్పష్టం చేశారు.


తన తల్లిని రక్షించేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న సత్వర నిర్ణయాన్ని అలాగే భారత్ పోషించిన కీలక పాత్రకు సాజీద్ వాజెద్ ధన్యవాదాలు తెలిపారు. ప్రాంతీయ వ్యవహారాల్లో భారతదేశం నాయకత్వ పాత్ర వహించాలని, పొరుగుదేశంతో స్థిరత్వాన్ని కొనసాగించాలని ఆయన కోరారు. బంగ్లాదేశ్ నాయకత్వంలో ఇటీవలి మార్పులను వాజెద్ ప్రస్తావిస్తూ.. బంగ్లాదేశ్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందన్నారు. తాత్కాలిక ప్రభుత్వ చట్టబద్ధతను వాజెద్ విమర్శించారు. దేశ ప్రజాస్వామ్య సమగ్రతను నిర్ధారించడానికి 90 రోజులలోపు ఎన్నికలను నిర్వహించాల్సిందేనని వాజెద్ నొక్కి చెప్పారు. సమర్థవంతంగా పరిపాలించే తాత్కాలిక ప్రభుత్వ సామర్థ్యాన్ని ప్రశ్నించారు.


షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో శాంతిని నెలకొల్పిందని, ఆర్థిక వృద్ధిని కొనసాగించిందని, తిరుగుబాట్లను నిలిపివేసిందనడంలో ఎంటాంటి సందేహమూ లేదని వాజెద్ తెలిపారు. తమ ఉపఖండంలోని తూర్పు భాగాన్ని సైతం స్టేబుల్‌గా ఉంచారనేది ఎవరూ కాదనలేని సత్యమన్నారు. ఇతర ప్రభుత్వాలు యత్నించి విఫలమైన వాటన్నింటినీ తమ ప్రభుత్వం చేసి చూపించిందని.. దేనినైనా సాధించగలమని నిరూపించిన ఏకైక ప్రభుత్వం తమదని సాజీబ్ వాజెద్ జాయ్ తెలిపారు. అలాగే తన తల్లి వారసత్వాన్ని ఈ తరుణంలో తాను అందిపుచ్చుకుంటానని వాజెద్ తెలిపారు. అయితే హసీనా తిరిగి రాజకీయాల్లో కొనసాగుతారా? లేదంటే వేరే ఏ దేశంలోనైనా ఆశ్రయం పొందుతారా? అనే విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. ఈ క్రమంలోనే వాజెద్ మాత్రం తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమన్నారు. తన పార్టీని రక్షించుకునేందుకు తాను ఏం చేయడానికైనా వెనుకాడబోనని వాజెద్ స్పష్టం చేశారు. ఈ రాజకీయ సంక్షోభానికి ముందు మాత్రం తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని ఆయన చెప్పారు.

Updated Date - Aug 10 , 2024 | 10:37 AM

Advertising
Advertising
<