ల్యాబ్‌ల బాటలో ఆలయాలు!
ABN, Publish Date - Sep 28 , 2024 | 04:22 AM
: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవస్థానాల్లోనూ అలజడి మొదలైంది.
పరీక్షలకు అయోధ్య రామమందిర ప్రసాదం
అయోధ్య/పూరీ, సెప్టెంబరు 27: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవస్థానాల్లోనూ అలజడి మొదలైంది. అయోధ్య రామమందిరం కూడా తన ప్రసాదం నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపింది. ఇక ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో అందించే మహాప్రసాదం నాణ్యతను నిర్ధారించడానికి రెండంచెల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్(ఎ్‌సజేటీఏ) నిర్ణయించాయి. దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న నెయ్యి, నూనెల స్వచ్ఛతపై అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ ఆందోళన వ్యక్తం చేశారు.
Updated Date - Sep 28 , 2024 | 04:22 AM