Allu Arjun: ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు నాన్న.. బన్ని కొడుకు లెటర్ వైరల్..
ABN, Publish Date - Dec 05 , 2024 | 01:40 PM
పుష్ప 2 రిలీజ్ సందర్భంగా నేషనల్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు నాన్న".. అంటూ అయాన్ రాసిన లేఖను బన్ని పోస్ట్ చేసి ఎమోషనల్ అయ్యారు.
Allu Arjun: ప్రస్తుతం పాన్ ఇండియన్ లెవెల్‌లో ఎక్కడ చూసిన నేషనల్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా క్రేజ్ కనిపిస్తోంది. పుష్ప 2 బ్లాక్‌బస్టర్ హిట్ అంటూ రివ్వూలు వస్తున్నాయి. అయితే, ఈ సినిమా రిలీజ్ సందర్భంగా హీరో అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ "ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు నాన్న" అంటూ ఓ లేఖ రాశాడు. కొడుకు అయాన్ రాసిన లెటర్ ని బన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎమోషనల్ అయ్యారు. తన కొడుకు రాసిన లెటర్ హృదయాన్ని హత్తుకుంది అని పేర్కొన్నారు.
లెటర్ లో ఏముందంటే..
అయాన్ లెటర్ లో ఏముందంటే.. "మీ సక్సెస్ పట్ల నాకు ఎంత గర్వంగా ఉందో చెప్పేందుకు ఈ లెటర్ రాస్తున్నా నాన్న.. ఈరోజు నాకు చాలా ప్రత్యేకం.. ఎందుకంటే ప్రపంచంలోనే ఒక గొప్ప నటుడి సినిమా రిలీజ్ అవుతోంది. నాకు మిక్స్‌డ్ ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి. పుష్ప 2 సినిమా మాత్రమే కాదు.. సినిమా పట్ల నీకున్న నిబద్ధతని తెలియజేస్తుంది. నా జీవితంలో ఎప్పటికీ నువ్వే హీరో నాన్న. నీకున్న కోట్లాది మంది అభిమానుల్లో నేను ఒకడిని" అంటూ అల్లు అయాన్ ప్రస్తావించాడు. చివరిగా పుష్ప అంటే ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్ అంటూ లెటర్ లో పేర్కొన్నాడు.
అర్థం చేసుకోండి..
కొడుకు అల్లు అయాన్ చిన్న పిల్లాడు రాసిన లేఖ కాబట్టి ఏవైనా తప్పులు ఉంటే పెద్ద మనసుతో అర్థం చేసుకోండి అని అల్లు అర్జున్ పోస్ట్ లో ప్రస్తావించాడు. ఈ లెటర్ చూసిన బన్ని అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు. అయితే, ఇటీవల పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అల్లు అర్జున్ కొడుకు అల్లు అయ్యాన్ సందడి చేసిన విషయం తెలిసిందే. పుష్ప తగ్గేదేలే అంటూ యాక్షన్ చేసి ఫ్యాన్స్ ను అలరించాడు. అంతేకాకుండా, రిసెంట్ గా నటుడు బాలకృష్ణ షో అన్ స్టాప్ బుల్ లోనూ అల్లు అర్జున్ కొడుకు అయాన్ తన మాటలతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
Updated Date - Dec 05 , 2024 | 01:53 PM