ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Amarnath Yatra 2024: అమర్‌నాథ్ యాత్రికులకు అలర్ట్.. అడ్వాన్స్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం..

ABN, Publish Date - Apr 15 , 2024 | 12:41 PM

అమర్‌నాథ్‌ వార్షిక యాత్ర(Amarnath Yatra 2024) జూన్‌ 29 నుంచి ఆగస్టు 19 వరకు కొనసాగుతుందని అమర్‌నాథ్‌ తీర్థక్షేత్ర బోర్డు శనివారం ప్రకటించింది. 52 రోజులపాటు సాగే యాత్రకు సంబంధించిన ముందస్తు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభమవుతుందని బోర్డు వెల్లడించింది.

అమర్‌నాథ్: అమర్‌నాథ్‌ వార్షిక యాత్ర(Amarnath Yatra 2024) జూన్‌ 29 నుంచి ఆగస్టు 19 వరకు కొనసాగుతుందని అమర్‌నాథ్‌ తీర్థక్షేత్ర బోర్డు శనివారం ప్రకటించింది. 52 రోజులపాటు సాగే యాత్రకు సంబంధించిన ముందస్తు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభమవుతుందని బోర్డు వెల్లడించింది.


హిమాలయాల్లోని 3,880 మీటర్ల ఎత్తులోని గుహలో ఏర్పడే మంచులింగాన్ని దర్శించేందుకు ఏటా నిర్వహించే అమర్‌నాథ్‌ యాత్రకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి 141 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్నాథ్ పవిత్ర గుహ ప్రఖ్యాతిగాంచింది.

జులై-ఆగస్టు (శ్రావణ మాసం)లో 'శ్రావణి మేళా' సమయంలో 'బాబా బర్ఫానీ'ని ఆరాధించడానికి భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటారు. సంవత్సరం మొత్తంలో అమర్‌నాథ్ గుహలోకి ప్రవేశించే ఏకైక సమయం ఇదే కావడం విశేషం.


యాత్ర షెడ్యూల్‌ను కూడా పుణ్యక్షేత్ర బోర్డు ప్రకటించింది. ఇది జూన్‌లో ప్రారంభమై ఆగస్టులో ముగియనుంది. భద్రతా చర్యలు పర్యవేక్షించడానికి NDRF, SDRF సిబ్బంది ప్రత్యేక శిక్షణ పొందుతారు. భక్తులకు క్లిష్టంగా అనిపించే ప్రాంతాల్లో బలగాలు మోహరిస్తాయి. అమర్‌నాథ్ యాత్ర గురించి జమ్మూ కాశ్మీర్ MRT టీమ్ ఇన్‌ఛార్జ్ రామ్ సింగ్ సలాథియా మాట్లాడుతూ.. జూన్‌లో అమర్‌నాథ్ యాత్ర జమ్మూ కాశ్మీర్‌లో ప్రారంభమై దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుందని తెలిపారు. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 15 , 2024 | 12:41 PM

Advertising
Advertising