ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Amit Shah : జమ్ము కాశ్మీర్‌‌‌లో శాంతి భద్రతలపై సమీక్ష

ABN, Publish Date - Jun 16 , 2024 | 01:50 PM

జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడుల రోజురోజుకు పెరుగుతోన్నాయి. మరోవైపు అమర్నాథ్ యాత్ర జూన్ మాసాంతం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఆదివారం న్యూఢిల్లీలో జరిగింది.

Home Minister Amith Shah

న్యూఢిల్లీ, జూన్ 16: జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడుల రోజురోజుకు పెరుగుతోన్నాయి. మరోవైపు అమర్నాథ్ యాత్ర జూన్ మాసాంతం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఆదివారం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సందర్బంగా జమ్ముకాశ్మీర్‌లో ప్రస్తుత శాంతి భద్రతల పరిస్థితులపై ఉన్నతాధికారులతో అమిత్ షా సమీక్ష నిర్వహించారు.


ఉగ్రవాద దాడుల నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు. ఉగ్రవాద చర్యలను నియంత్రించేందుకు భద్రత దళాలు వెంటనే చర్యలు చేపట్టేలా చూడాలని ఆదేశించారు. ఇక జూన్ 29వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. సరిహద్దు ప్రాంతాల్లో చొరబాట్లకు ఆస్కారం ఉందని.. ఈ నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ క్రమంలో అంతర్జాతీయ సరిహద్దులతోపాటు సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భద్రతా దళాలను మోహరించాలని ఉన్నతాధికారులకు ఆయన స్పష్టం చేశారు. జమ్ము కాశ్మీర్‌లో తీవ్రవాద నిరోధానికి చేపడుతున్న చర్యలను మరింత బలోపేతం చేయాలన్నారు.


ఉగ్రవాద నిరోధక చర్యలపై ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన ఆదేశాలను అమిత్ షా ఈ సందర్బంగా ప్రస్తావించారు. ఈ సమీక్ష సమావేశంలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజిత్ భల్లా, జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా‌తోపాటు ఆ రాష్ట్రానికి చెందిన పలు కీలక శాఖల ఉన్నతాధిరులు పాల్గొన్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 16 , 2024 | 02:02 PM

Advertising
Advertising