ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amit Shah: 2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అంచనా వేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ABN, Publish Date - Aug 04 , 2024 | 06:11 PM

ఈ ఏడాది మే నెలలోనే లోక్‌సభ ఎన్నికలు-2024 జరిగాయి. ఎన్డీయే కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. విపక్షాలు గతంతో పోల్చితే పుంజుకున్నప్పటికీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమవ్వాల్సి వచ్చింది.

Amit Shah

న్యూఢిల్లీ: ఈ ఏడాది మే నెలలోనే లోక్‌సభ ఎన్నికలు-2024 జరిగాయి. ఎన్డీయే కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. విపక్షాలు గతంతో పోల్చితే పుంజుకున్నప్పటికీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమవ్వాల్సి వచ్చింది. ప్రభుత్వం కొలువుదీరి దాదాపు రెండు నెలల పూర్తికావొస్తోంది. అయితే 2029లో జరగబోయే 2029 లోక్‌సభ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీ దేశానికి నాలుగోసారి దేశ ప్రధాని అవుతారని, ఇక విపక్ష ఇండియా కూటమి ప్రతిపక్షంలోనే కూర్చుంటుందని జోస్యం చెప్పారు. చండీగఢ్‌లో నీటి సరఫరా ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు.


ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్పాదలుచుకున్నా ఆందోళన చెందవద్దంటా బహిరంగ సమావేశానికి హాజరైన కార్యకర్తలకు ఆయన భరోసా ఇచ్చారు. 2029లో కూడా ఎన్డీయే అధికారంలోకి వస్తుందని, నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో ప్రతిపక్షాల సీట్లు పెరగడంపై మాట్లాడుతూ.. ‘కొంత విజయంతో’ ఎన్నికల్లో గెలిచినట్టు భావిస్తున్నారని, కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుందని ఆయన ప్రస్తావించారు. గత మూడు ఎన్నికల్లోనూ బీజేపీనే అత్యధిక సీట్లు దక్కించుకుందని పేర్కొన్నారు. ‘‘కొంత విజయంతో మేము ఎన్నికల్లో విజయం సాధించేశామని వారు (ప్రతిపక్షాలు) భావిస్తున్నారు. గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని వారికి తెలియదు’’ అని అమిత్ షా విమర్శించారు. అనిశ్చితిని సృష్టించాలని భావిస్తున్న వ్యక్తులు ప్రభుత్వం నడవదంటూ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారని విమర్శంచారు.


ప్రతిపక్షాలకు అమిత్ షా సూచన ఇదే..

ప్రతిపక్షంలో ఉండి సమర్థవంతంగా పని చేయడం నేర్చుకోండంటూ విపక్షాల ఇండియా కూటమికి అమిత్ షా సలహా ఇచ్చారు. తమ ప్రభుత్వం ఐదేళ్ల అధికారాన్ని పూర్తి చేసుకుంటుందని, తదుపరి అధికారం కూడా తమదేనని ప్రతిపక్ష మిత్రులకు చెప్పాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధంగా ఉండాలని, ప్రతిపక్షంలో సమర్థవంతంగా పనిచేయడం నేర్చుకోండంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాగా లోక్‌సభ ఎన్నికలు -2024లో బీజేపీ 240 సీట్లు గెలుచుకుంది. 2019లో ఒంటరిగా 303 సీట్లు సాధించిన ఆ పార్టీ ఈసారి గణనీయ సంఖ్యలో స్థానాలను కోల్పోయింది. దీంతో ప్రస్తుత ప్రభుత్వం ప్రధానంగా జేడీయూ, టీడీపీ మిత్రపక్షాలపై ఆధారపడింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో అంచనాలకు మించి 99 స్థానాలు దక్కించుకుంది. 2019లో 52 స్థానాలకే పరిమితమవ్వగా ఈసారి గణనీయంగా పుంచుకుంది.

Updated Date - Aug 04 , 2024 | 06:13 PM

Advertising
Advertising
<