Amit Shah: అమిత్‌షా కోల్‌కతా పర్యటన వాయిదా.. ఎందుకంటే
ABN, Publish Date - Oct 21 , 2024 | 08:40 PM
అమిత్‌షా పర్యటన నేపథ్యంలో అక్టోబర్ 22 నుంచి నాలుగు రోజుల పాటు ఎగుమతి-దిగుమతుల కార్యక్రమాలను ఆపివేయాలంటూ ది ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంతకుముందే నోటీసులు జారీ చేసింది.
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ఈనెల 24న కోల్‌కతాలో పర్యటించాల్సి ఉండగా తాజాగా ఆ పర్యటన వాయిదా పడింది. 'దానా' తుపాను (Dana cyclone) హెచ్చరికల నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
Taslima Nasreen: నన్ను ఇక్కడే ఉండనీయండి.. అమిత్‌షాను కోరిన తస్లీమా నస్రీన్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా తెలిపింది. ఈ అల్పపీడనం క్రమంగా వాయవ్య దిశకు దూసుకొస్తోందని, అది బలపడి తుపానుగా మారనుందని పేర్కొంది. దీనికి "దానా తుఫాన్''గా నామకరణం చేశారు. ఈ తుఫాన్ పూరీ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. ఆ ప్రభావంతో అంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
దానా తుపాను ఉత్తర ఒడిసా, పశ్చిమబెంగాల్ తీరప్రాంతాలను తాకే అవకాశం ఉందని, పూరీ, సాగర్ ఐలాండ్ మధ్య 24-25వ తేదీ అర్ధరాత్రి తీరాన్ని తాకవచ్చని ఐఎండీ తెలిపింది. గంటకి 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలు వీచవచ్చని తెలిపింది. దానా తుపాను హెచ్చరికల నేపథ్యంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ (ఎన్డీఆర్ఎఫ్) అప్రమత్తమైంది. పశ్చిమబెంగాల్‌లో 14 టీమ్‌లు, ఒడిశాలో 11 టీమ్‌లను మోహరించింది. కాగా, అమిత్‌షా పర్యటన నేపథ్యంలో అక్టోబర్ 22 నుంచి నాలుగు రోజుల పాటు ఎగుమతి-దిగుమతుల కార్యక్రమాలను ఆపివేయాలంటూ ది ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంతకుముందే నోటీసులు జారీ చేసింది.
Read More National News and Latest Telugu News
ఇది కూడా చదవండి..
CJI: అయోధ్య వివాద పరిష్కారం కోసం దేవుడ్ని ప్రార్థించా.. జస్టిస్ చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Updated Date - Oct 21 , 2024 | 08:41 PM