Ayodhya: అయోధ్యలో 14.5 కోట్లతో భూమి కొనుగోలు చేసిన అమితాబ్
ABN, Publish Date - Jan 15 , 2024 | 02:29 PM
అయోధ్య సరయులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) భూమి కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా ద్వారా కొనుగోలు ప్రక్రియ జరిగింది. అమితాబ్ భూమి కొనుగోలు వివరాలును గోప్యంగా ఉంచారు.
అయోధ్య: అయోధ్యలో రామ్‌లల్లా ( Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22వ తేదీన జరగనుంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రముఖులకు స్వయంగా ఆహ్వానం పంపించారు. అయోధ్య పురి రామనామ స్మరణతో మారుమోగుతుంది.
అయోధ్య సరయులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) భూమి కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా ద్వారా కొనుగోలు ప్రక్రియ జరిగింది. అమితాబ్ భూమి కొనుగోలు వివరాలును గోప్యంగా ఉంచారు. 10 వేల చదరపు అడుగుల భూమిని రూ.14.5 కోట్లకు అమితాబ్ కొనుగోలు చేశారు.
‘తన హృదయంలో ప్రత్యేక స్థానం కలిగిన అయోధ్యలో భూమి కొనుగోలు చేశా. అయోధ్యలో ఆధ్యాత్మికత, సాంస్కృతిక సంపద భౌగోళిక సరిహద్దులను దాటి భావొద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకుంది. అయోధ్య ఆత్మలోకి ప్రయాణం ప్రారంభమైంది. సంప్రదాయం, ఆధునికత కలిగిన నగరంలోకి అడుగిడాను. ప్రపంచ ఆధ్మాత్మిక రాజధానిలో ఇల్లు నిర్మించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని అమితాబ్ బచ్చన్ తెలిపారు
అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేసిన భూమి రామ మందిరానికి 15 నిమిషాల దూరంలో ఉంటుంది. ఇక్కడినుంచి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 30 నిమిషాల సమయం పడుతుంది. అయోధ్యలో అమితాబ్ భూమి కొనుగోలు చేయడంతో ప్రాజెక్ట్‌కు మరింత పేరు వస్తుందని ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 15 , 2024 | 02:29 PM