ఇంట్లోనే యోగా నేర్పే ‘యోగిఫై’ ఏఐ టెక్నాలజీతో యోగా మ్యాట్ రూపకల్పన
ABN, Publish Date - Jun 23 , 2024 | 03:12 AM
యోగాసనాలు వేసేటప్పుడు సూచనలు ఇవ్వడంతో పాటు భంగిమల్లో ఏర్పడే పొరపాట్లను సరిదిద్దేందుకు ఐఐటీ మండీ ఆధ్వర్యంలో ఏఐ ఆధారిత యోగా మ్యాట్‌ను రూపొందించారు.
న్యూఢిల్లీ, జూన్ 22: యోగాసనాలు వేసేటప్పుడు సూచనలు ఇవ్వడంతో పాటు భంగిమల్లో ఏర్పడే పొరపాట్లను సరిదిద్దేందుకు ఐఐటీ మండీ ఆధ్వర్యంలో ఏఐ ఆధారిత యోగా మ్యాట్‌ను రూపొందించారు. ‘యోగిఫై’ పేరుతో పిలిచే ఈ మ్యాట్‌ను ఐఐటీ మండీలోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్, డీఎ్‌సటీ ఎన్‌ఎమ్- ఐసీపీఎస్ ప్రొగ్రామ్ సహాయంతో విల్లినెస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్ట్ అప్ సంస్థ అభివృద్ధి పరిచింది.
దీనిని శనివారం శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ తరఫున కేంద్రమంత్రులు జైశంకర్, అశ్వినీ వైష్ణవ్, నిర్మలకు అందజేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ మ్యాట్ అనేక స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉందని, యోగా చేసేటప్పుడు అంచెల వారీగా సూచనలు చేయడంతో పాటు రియల్‌టైమ్ ఫీడ్‌బ్యాక్‌ను అందిస్తుందని దీని సృష్టికర్తలు తెలిపారు. దీని సహాయంతో రకరకాల యోగాసనాలు నేర్చుకోవచ్చని, దీనిని ఇంట్లోని స్మార్ట్ పరికరాలతో అనుసంధానించి వాడుకోవచ్చని వారు సూచించారు.
Updated Date - Jun 23 , 2024 | 07:07 AM