ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ambanis Wedding: అంబానీ ఇంట తెలుగింటి రుచులు.. అదిరిపోయే మెనూ ఇదే

ABN, Publish Date - Jul 03 , 2024 | 05:29 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ(Ananth Ambani), రాధిక మర్చంట్ వివాహం.. జులై 12న ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ వేడుకను చరిత్రలో నిలిచిపోయేవిధంగా జరపాలని అంబానీ ఫ్యామిలీ నిర్ణయించింది. ఇప్పటికే వీరు 50కిపైగా జంటలకు సామూహిక వివాహాలు జరిపారు.

ఇంటర్నెట్ డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ(Ananth Ambani), రాధిక మర్చంట్ వివాహం.. జులై 12న ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ వేడుకను చరిత్రలో నిలిచిపోయేవిధంగా జరపాలని అంబానీ ఫ్యామిలీ నిర్ణయించింది.

ఇప్పటికే వీరు 50కిపైగా జంటలకు సామూహిక వివాహాలు జరిపారు. అనంత్ వివాహ వేడుకకు వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా వంటకాలు చేయించనున్నారు. అయితే పెళ్లి మెనూలో ఓ చాట్ అందరినీ ఆకర్షిస్తోంది. వారణాసిలోని ప్రసిద్ధ కాశీ చాట్ భండార్ చాట్ వివాహా మెనూలో ఉంది. స్టాల్‌లో టిక్కీ, టొమాటో చాట్, పాలక్ చాట్, చనా కచోరీ, కుల్ఫీతో సహా పలు రకాల రుచికరమైన చాట్‌లు ఉంటాయి.


రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్మన్ నీతా అంబానీ జూన్‌లో వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె కాశీ చాట్ భండార్‌లో చాట్ ఆస్వాదించారు. ఆ చాట్ తనకు నచ్చడంతో అనంత్ అంబానీ వివాహ వేడుకలో దీన్ని ప్రత్యేకంగా చేయించనున్నారు.

"నీతా అంబానీ జూన్ 24న మా చాట్ భండార్‌కు వచ్చారు. టిక్కీ చాట్, టొమాటో చాట్, పాలక్ చాట్, కుల్ఫీ ఫలూడా రుచి చూసి చాలా బాగున్నాయని కితాబిచ్చారు. ఇక్కడ బనారస్ చాట్ చాలా ప్రసిద్ధి. ఇప్పుడు అనంత్ పెళ్లికి మా చాట్ సర్వ్ చేయడం ఆనందంగా ఉంది" అని చాట్ బండార్ యజమాని రాకేష్ కేశరీ అన్నారు. నీతా అంబానీ చాట్ భండార్‌కి వెళ్లిన తరువాత ఆ షాప్‌కి ఆహార ప్రియులు క్యూ కట్టడం ప్రారంభించారు. ఇప్పుడు ముంబయిలో అది టాప్ ఫేమస్ చాట్‌గా ప్రసిద్ధి చెందింది.


దక్షిణాఫ్రికా వాసి అనికా మాట్లాడుతూ.. "నీతా అంబానీ ఇక్కడికి వచ్చి చాట్ తిన్నారని విన్నాను. నేను నా భర్త చాట్‌ని ఆస్వాదించాం. అనంత్ అంబానీ పెళ్లిలో ఈ చాట్ పెడితే అతిథులంతా చక్కగా ఆస్వాదిస్తారు" అని అన్నారు. అతిథులకు భారతీయ వంటకాలతో పాటు జపనీస్, మెక్సికన్, థాయ్, పార్సీ వంటి పలు దేశాల సంప్రదాయ వంటలను రుచి చూపించనున్నారు. మొత్తంగా 3వేలకుపైగా వంటకాలు ఉంటాయని తెలుస్తోంది.

బ్రేక్ ఫాస్ట్‌లో 80 రకాలు, మధ్యాహ్నం లంచ్‌లో 255 వంటలు, రాత్రి డిన్నర్‌లో 300 రకాల వంటకాలు ఉండనున్నాయి. పోహా, జిలేబీ, భుట్టే కా కీస్, కచోరీ తదితర వంటకాలు వడ్డించనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వెజ్‌లో తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన దాదాపు అన్ని వంటకాలు చేయనున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 03 , 2024 | 05:53 PM

Advertising
Advertising