Jamnagar: అంబానీ కుటుంబానికి సెంటిమెంట్‌గా జామ్‌నగర్.. ప్రత్యేకతేంటి?
ABN, Publish Date - Jul 17 , 2024 | 11:18 AM
ఇటీవలే వివాహ చేసుకున్న అనంత్ అంబానీ, రాధికా(Ananth Ambani Radhika Merchant) మర్చంట్ పెళ్లి తరువాత తొలిసారి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వెళ్లారు.
జామ్‌నగర్: ఇటీవలే వివాహ చేసుకున్న అనంత్ అంబానీ, రాధికా(Ananth Ambani Radhika Merchant) మర్చంట్ పెళ్లి తరువాత తొలిసారి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వెళ్లారు. వారికి కుటుంబ సభ్యులు, ప్రజలు స్వాగతం పలికారు. మీలో చాలా మందికి తెలిసి ఉండవచ్చు. అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జామ్‌నగర్‌లోనే జరిగింది. అంబానీ కుటుంబం జామ్‌నగర్‌ని ఎందుకంత సెంటిమెంట్‌గా భావిస్తుందో తెలుసా.
1. అనంత్ అంబానీ అమ్మమ్మ కోకిలాబెన్ అంబానీ జామ్‌నగర్‌లోనే జన్మించారు.
2. అనంత్ తాత, వ్యాపారవేత్త ధీరూభాయ్ అంబానీ, తండ్రి ముఖేష్ అంబానీ జామ్‌నగర్‌లోనే తమ వ్యాపారాన్ని ప్రారంభించారు.
3. అనంత్, రాధికల ప్రేమ కూడా ఇక్కడే చిగురించింది. వారిద్దరూ తమ బాల్యాన్ని జామ్‌నగర్‌లోనే గడిపారు.
ప్రీ వెడ్డింగ్ షూట్ సందర్భంగా రాధిక మర్చంట్ తన ప్రసంగంలో.. "మా హృదయాల్లో జామ్‌నగర్ ఉంది. ఇక్కడే మేం పెరిగాము. స్నేహితులం అయ్యాం.ఇక్కడి నుంచే మేం భవిష్యత్తును కలిసి ప్రారంభించాం. కరోనా మహమ్మారి సమయంలోనూ ఇక్కడే ఉండి కాలక్షేపం చేశాం" అని పేర్కొన్నారు.
కన్యాదానంపై నీతా అంబానీ వ్యాఖ్యలకు కంటతడి..
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహ వేడుకలు ముగిసే సందర్భంలో నీతా అంబానీ(Nita Ambani)కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో నీతా అంబానీ కన్యాదానం (Kanyadaan) ప్రాముఖ్యత గురించి ఎంతో చక్కగా వివరించారు. అది విన్న వారు భావోద్వేగానికి గురవుతున్నారు.
కన్యాదానం (Kanyadaan) అనేది సాధారణ సంప్రదాయం కంటే గొప్పదని నీతా అంబానీ అన్నారు. ఇది రెండు కుటుంబాల మధ్య అనుబంధానికి చిహ్నమని వ్యాఖ్యానించారు. కన్యాదానంతో ఒక కుటుంబానికి ఓ కొడుకు, మరొకరికి ఓ కుమార్తె లభిస్తుందని, రెండు కుటుంబాల మధ్య పరస్పర ప్రేమ, గౌరవ మార్పిడి జరిగి చక్కటి అనుబంధాన్ని ఏర్పరస్తుందని చెప్పారు. కన్యాదానం కొత్త కుటుంబానికి నాంది పలుకుతుందని, హిందూ సంస్కృతిలో కుమార్తెల పాత్ర చాలా కీలకం అని ఆమె పేర్కొన్నారు.
‘‘ఆడపిల్లలకు ప్రేమ, ఆనందం, శక్తిని అందించేందుకు ఈ వేడుక గౌరవంగా ఉంటుంది. కన్యాదానం వేడుక ప్రేమ, గౌరవం, ఐక్యతకు శాశ్వతమైన చిహ్నం. కన్యాదానం నిర్వహించడం ద్వారా ఇరు కుటుంబాలు వారి బిడ్డలను గౌరవించడమే కాకుండా భవిష్యత్తును కూడా అర్థం చేసుకుంటారు. కన్యాదానం అంటే 'కూతురిని ఇవ్వడం'. హిందూ వివాహాలలో ముఖ్యమైన సంప్రదాయం. ఇందులో వధువు తల్లిదండ్రులు వరుడికి చేయి అందించే రెండు కుటుంబాల కలయికకు ప్రతీక’’ అని ఆమె చెప్పారు. ‘‘కుమార్తెలు ప్రపంచంలోనే అత్యుత్తమ దీవెనలు. కుమార్తెను ప్రతి కుటుంబానికి ఒక లక్ష్మిగా భావిస్తారు. మీరు మీ కూతురిని మాకు ఇవ్వడం లేదు. కానీ మీరు మా కొడుకు, కొత్త కుటుంబాన్ని పొందుతున్నారని శైలా, వీరేన్‌కు చెప్పాలనుకుంటున్నాను. ఇక రాధికా-అనంత్ అంబానీకి మేము హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము’’ అని అన్నారు. నీతా అంబానీ మాటలు విని అక్కడ ఉన్న చాలా మంది ఉద్వేగానికి లోనయ్యారు. పలువురు కన్నీటి పర్యంతమైన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం భావోద్వేగానికి గురవుతున్నారు.
For Latest News and National News click here
Updated Date - Jul 17 , 2024 | 12:40 PM