ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bihar: కూలిన మరో వంతెన.. పక్షం రోజుల్లో...

ABN, Publish Date - Jul 03 , 2024 | 05:02 PM

బిహార్‌లో వరుసగా వంతెనలు కూలిపోతున్న ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. బుధవారం ఉదయం వంతెనలోని కొంత భాగం కూలిపోయింది. దీంతో బిహార్‌లో గత పక్షం రోజుల్లో ఏడు వంతెనలు కూలినట్లయింది.

బిహార్‌, జులై 03: బిహార్‌లో వరుసగా వంతెనలు కూలిపోతున్న ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. బుధవారం ఉదయం వంతెనలోని కొంత భాగం కూలిపోయింది. దీంతో బిహార్‌లో గత పక్షం రోజుల్లో ఏడు వంతెనలు కూలినట్లయింది. సివాన్ జిల్లాలోని గండకి నదిపై నిర్మించిన వంతెనకు సంబంధించిన కొంత భాగం ఈ రోజు కూలింది. ఇదే జిల్లాలో 10 రోజుల క్రితం ఓ వంతెన కూలిన సంగతి తెలిసిందే.

Also Read: Harthas incident: మృతదేహాలు చూసి తట్టుకోలేక పోయాడు.. పాపం..

డియోరియా బ్లాక్‌లోని ఈ వంతెనలోని కొంత భాగం ఈ రోజు ఉదయం 5.00 గంటలకు కూలిందని డిప్యూటి డెవలప్‌మెంట్ కమిషనర్ ముఖేష్ కుమార్ వెల్లడించారు. అయితే ఈ అందుకు గల కారణాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. 1982-83లో ఈ వంతెన నిర్మాణం జరిగిందన్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ వంతెన మరమ్మతు పనులు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. మహారాజ్‌గంజ్‌తో వివిధ గ్రామాలను ఈ వంతెన కలుపుతుందని వివరించారు.

Also Read: Hathras stampede: ఎఫ్ఐఆర్‌లో లేని ‘బోలే బాబా’.. కోవిడ్‌లో సైతం సత్సంగం


అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గండకి నది వరద పోట్టెత్తిందని గ్రామస్తులు తెలిపారు. ఆ క్రమంలో వంతెన నిర్మాణం బలహీనపడే అవకాశం ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక వంతెన కూలిన ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. జూన్ 22వ తేదీన సివాన్ జిల్లాలో ఇదే డియోరియా ప్రాంతంలో ఓ వంతెన కుప్పకూలిన సంగతి తెలిసిందే.

Also Read: Hathras Event: లైంగిక వేధింపుల కేసుల్లో ‘బోలే బాబా’..!

మరోవైపు బిహార్‌లోని మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్‌గంజ్ జిల్లాల్లో వరుసగా వంతెనలు కూలిపోతున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలకు గల కారణాలు అన్వేషించేందుకు బిహార్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా వంతెనలు కూలిన ఘటనలపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Read Latest National News and Telugu News

Updated Date - Jul 03 , 2024 | 05:08 PM

Advertising
Advertising