ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Arvind Kejriwal: తన అరెస్ట్‌ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు అరవింద్ కేజ్రీవాల్

ABN, Publish Date - Apr 10 , 2024 | 11:27 AM

తనకు ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైన నేపథ్యంలో.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. తనని ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అక్రమంగా అరెస్ట్ చేసిందని, తనకు వెంటనే ఉపశమనం కల్పించాలని కోరారు.

తనకు ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) నిరాశ ఎదురైన నేపథ్యంలో.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తాజాగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. తనని ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (Enforcement Directorate) అక్రమంగా అరెస్ట్ చేసిందని, తనకు వెంటనే ఉపశమనం కల్పించాలని కోరారు. ఈమేరకు.. సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసినట్లు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ (Vivek Jain) తెలిపారు. అలాగే.. తన అరెస్ట్‌పై హైకోర్టు చేసిన వ్యాఖ్యల మీద కూడా కేజ్రీవాల్ ఆ పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Maharashtra: తల్లి కాదు కసాయి.. ప్రియుడితో పారిపోవడం కోసం ఇద్దరు పిల్లల్ని..


కాగా.. మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ని (Kejriwal Arrest) ఈడీ మార్చి 21వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తనని అరెస్ట్ చేసిన వెంటనే.. తన అరెస్ట్‌, రిమాండ్‌ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే.. అక్కడ ఆయనకు ఊరట లభించలేదు. ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని, అందుకే ఆ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. అరెస్టు, రిమాండ్‌ చట్టవిరుద్ధం కాదని తెలిపింది. మనీలాండరింగ్‌పై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్‌ చెప్పారని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయం ఉండదని తేల్చి చెప్పింది.

Nitish Reddy: తన స్ట్రాటజీని బయటపెట్టిన నితీశ్.. పెద్ద ప్లానింగే ఇది!

ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ బుధవారం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. మరి.. సుప్రీం ఎలాంటి తీర్పునిస్తుంది? కేజ్రీవాల్‌కి అనుకూలంగానా లేకపోతే ఢిల్లీ హైకోర్టు తీర్పుని సమర్థిస్తుందా? అసలు ఈ పిటిషన్‌ని సర్వోన్నత న్యాయస్థానం స్వీకరిస్తుందా? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా.. ఆప్ నేతలు తమ అధినేతకు ఉపశమనం దక్కాలని బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే.. సార్వత్రిక ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఈలోపే ఊరట లభిస్తే.. ఎన్నికలకు సంబంధించిన కసరత్తులు చేసుకోవచ్చని భావిస్తున్నారు. కేజ్రీవాల్ జైల్లోనే ఉంటే.. ఆ పనులు నిర్వహించడం కష్టం కాబట్టి, తమ నాయకుడు బయటకు రావాలని ఆశిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2024 | 01:47 PM

Advertising
Advertising