ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AAP: ఢిల్లీ సీఎం పీఠం ఎవరికో తేలేది అప్పుడే

ABN, Publish Date - Sep 16 , 2024 | 09:55 PM

సీఎం పదవికి కేజ్రీవాల్ (Arvind Kejriwal) మంగళవారం రాజీనామా చేయనున్నారు. నూతన ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఆమ్ ఆద్మీ పార్టీ రేపే ప్రకటన చేయనుంది. ఉదయం11 గంటలకు కేజ్రీవాల్ నివాసంలో ఆప్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది.

ఢిల్లీ: సీఎం పదవికి కేజ్రీవాల్ (Arvind Kejriwal) మంగళవారం రాజీనామా చేయనున్నారు. నూతన ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఆమ్ ఆద్మీ పార్టీ రేపే ప్రకటన చేయనుంది. ఉదయం11 గంటలకు కేజ్రీవాల్ నివాసంలో ఆప్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. సాయంత్రం 4:30కు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి కేజ్రీవాల్ తన రాజీనామా లేఖను అందిస్తారు. తరువాత నూతన శాసనసభా పక్ష నేతగా ఎంపికైన నేత పేరును లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపనున్నారు. ముఖ్యమంత్రిగా ఎవరనేదానిపై కేజ్రీవాల్ పీఏసీలో నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. సునీత కేజ్రీవాల్, అతిశీ, కైలాష్ గెహ్లాట్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్ తదుపరి సీఎం రేసులో ఉన్నారు.


గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన కేజ్రీ..

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనా‌ (VK Saxena)ను కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు కలుసునేందుకు ఎల్జీ అనుమతించినట్టు 'ఆప్' వెల్లడించింది. ఎన్నికల వరకూ పార్టీ నేతల్లో ఒకరు ముఖ్యమంత్రిని చేయనున్నట్టు పార్టీ సమావేశంలో కేజ్రీవాల్ వెల్లడించిన నేపథ్యంలో ఇందుకు సోమవారంనాడు కసరత్తు జరిగింది. కేజ్రీవాల్‌ను ఆప్ సీనియర్ నేతలు మనీష్ సిసోడియా, రాఘవ్ చద్దా ఈరోజు ఉదయం కలుసున్నారు.


మరోవైపు, కేజ్రీవాల్ జైలులో ఉన్న సమయంలో పార్టీ కీలక బాధ్యతలు నిర్వహించిన అతిషి ముఖ్యమంత్రి రేసులో ముందున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో సునీత కేజ్రీవాల్, గోపాల్ రాయ్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గత శుక్రవారం బెయిలుపై విడుదలైన కేజ్రీవాల్ అనూహ్యంగా పార్టీ కార్యకర్తలు సమావేశంలో రాజీనామా ప్రకటన చేశారు. 48 గంటల్లో రాజీనామా చేస్తానన్నారు. సుప్రీంకోర్టు తనకు న్యాయం చేసిందని, ప్రజాకోర్టులోనూ న్యాయం జరిగిన తర్వాతే తిరిగి సీఎం సీట్లో కూర్చుంటానని చెప్పారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.

Also Read:Uttar Pradesh: భారీ వర్షాలతో యూపీ అతలాకుతలం : 14 మంది మృతి

Updated Date - Sep 16 , 2024 | 09:55 PM

Advertising
Advertising