ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: లిక్కర్ కేసులో మరో ట్విస్ట్.. ఆ ఫోన్ పోయిందని చెప్పిన కేజ్రీవాల్.. అందులో ఏముందంటే?

ABN, Publish Date - Mar 24 , 2024 | 08:39 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన్ని మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి తీసుకోవడంతో అధికారులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాలేనని అధికారులు అంటున్నారు. ఆయన్ని విచారిస్తున్న క్రమంలో ఊహించని ఓ ట్విస్ట్ ఈడీ అధికారులకు ఎదురైంది.

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన్ని మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి తీసుకోవడంతో అధికారులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాలేనని అధికారులు అంటున్నారు. ఆయన్ని విచారిస్తున్న క్రమంలో ఊహించని ఓ ట్విస్ట్ ఈడీ అధికారులకు ఎదురైంది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందిస్తున్నప్పుడు ఉపయోగించిన ఫోన్ మిస్ అయిందంటూ కేజ్రీవాల్ అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన సమాధానంతో వారు షాక్ తిన్నారు. ఆదివారం కేజ్రీ విచారణ 4 గంటలపాటు సాగింది. ఆ సమయంలో లిక్కర్ పాలసీ రూపొందిస్తున్నప్పుడు కేజ్రీ వాడిన ఫోన్ గురించి అడగ్గా అది కనిపించకుండా పోయిందని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.

లిక్కర్ స్కాంకి సంబంధించిన కీలకమైన డేటా అందులో ఉంటుందని ఈడీ ఆఫీసర్లు భావిస్తున్నారు. దీంతో ఆ ఫోన్ వెతికే పనిలో పడ్డారు. ఇదే కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా కార్యదర్శి అరవింద్ ఎదుట మంగళవారం కేజ్రీవాల్‌ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇవాళ కేజ్రీని కలిసేందుకు ఆయన భార్య సునీత ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా మార్చి 31న ఇండియా కూటమి నేతలు మెగా ర్యాలీ నిర్వహించనున్నారు.


జైలు నుంచే తొలి ఆదేశం..

ఈడీ అదుపులో ఉన్న కేజ్రీవాల్ జైలులో నుంచే పాలన సాగిస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి తన మొదటి ఉత్తర్వును జలవనరుల శాఖకు జారీ చేశారు. ఇవాళ సమావేశం నిర్వహించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి సీఎం ఆదేశాల గురించి సమాచారం ఇచ్చారు. కేజ్రీవాల్‌ అరెస్టుతో ఢిల్లీ ప్రభుత్వం ఎలా నడుస్తుందనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అనే అనుమానం చాలా మందికి కలిగింది. సీఎం కేజ్రీవాల్ ను జైలుకు పంపితే అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి అనుమతి తీసుకుని ప్రభుత్వాన్ని నడిపేందుకు జైలులోనే కార్యాలయం నిర్మిస్తామని పంజాబ్‌ సీఎం చెప్పారు. పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ స్థానాన్ని ఎవరూ తీసుకోలేరని తెలిపారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా పార్టీని స్థాపించారని గుర్తు చేసుకున్నారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపలేమని రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదని, చట్టం ప్రకారం నేరం రుజువయ్యేంత వరకు జైలు నుంచే పని చేయవచ్చని మాన్‌ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 24 , 2024 | 08:40 PM

Advertising
Advertising