Ram Mandir: త్వరలో అసదుద్దీన్ రామనామాన్ని స్మరిస్తారు..! వీహెచ్‌పీ కౌంటర్
ABN, Publish Date - Jan 21 , 2024 | 09:58 AM
తమ నుంచి బాబ్రీ మసీదును లాక్కున్నానరని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ ఖండించారు.
అయోధ్య: బాబ్రీ మసీదును తమ నుంచి లాక్కున్నారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బాబ్రీ మసీదును మా నుంచి క్రమ పద్దతిలో లాక్కుకున్నారు. 1992లో మసీదు కూల్చివేయకుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇప్పుడు ముస్లింలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే వారు కాదు’ అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగే క్రమంలో అగ్గిరాజే ప్రయత్నం చేశారు అసదుద్దీన్ ఒవైసీ.
అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ ఖండించింది. ‘గత 500 ఏళ్లలో మీ పూర్వీకులు ఎవరైనా అయోధ్యను సందర్శించారా..? ఒవైసీ లండన్‌లో న్యాయ విద్యను చదివారు కదా. మసీదును కాపాడేందుకు ఆయన ఎందుకు కోర్టుకు వెళ్లలేదు. ఇది ముమ్మాటికీ రాజకీయమే. త్వరలో రామ భక్తులుగా మారతామని ఆ పార్టీ అర్థం చేసుకోవాలి. అసదుద్దీన్ ఒవైసీ రామ నామాన్ని స్మరిస్తారు అని’ వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ సెటైర్లు వేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 21 , 2024 | 11:45 AM