ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Asaram Bapu: జైలు నుంచి బయటకు ఆశారాం బాపు..

ABN, Publish Date - Aug 13 , 2024 | 06:06 PM

స్వయం ప్రకటిత బాబా ఆశారాం బాపుకి ఏడు రోజుల పెరోల్ లభించింది. లైంగిక దాడి కేసులో ఆశారాం బాపు జీవిత ఖైదు అనుభవిస్తోన్న సంగతి తెలిసిందే. 85 ఏళ్ల ఆశారాం బాపుకి ఆరోగ్యం బాగోలేదు. చికిత్స కోసం మహారాష్ట్ర తీసుకెళ్లాలని రాజస్థాన్ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

Asaram Bapu

స్వయం ప్రకటిత బాబా ఆశారాం బాపుకి (Asaram Bapu) ఏడు రోజుల పెరోల్ లభించింది. లైంగిక దాడి కేసులో ఆశారాం బాపు జీవిత ఖైదు అనుభవిస్తోన్న సంగతి తెలిసిందే. 85 ఏళ్ల ఆశారాం బాపుకి ఆరోగ్యం బాగోలేదు. చికిత్స కోసం మహారాష్ట్ర తీసుకెళ్లాలని రాజస్థాన్ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.


మైనర్లపై లైంగికదాడి

ఆశ్రమంలో మహిళలు, మైనర్లపై ఆశారాం బాపు లైంగికదాడికి తెగబడ్డారు. ఓ మైనర్ బాలికపై లైంగికదాడికి సంబంధించి జోధ్ పూర్ కోర్టులో నేరం రుజువయ్యింది. దాంతో జీవితఖైదు విధించడంతో.. జోధ్ పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఆశారాం బాపుకు 85 ఏళ్లు ఉన్నాయి. వయో సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు.



సుప్రీంకోర్టు నో

పోస్కో కేసులో శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని గత ఏడాది ఆశారాం బాపు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆరోగ్య సంబంధిత సమస్యలతో జీవితఖైదు శిక్ష రద్దు చేయాలని కోరారు. ఆశారాం బాపు అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వైద్యం కోసం రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించొచ్చని స్పష్టం చేసింది. దాంతో రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఏడు రోజుల పెరోల్‌కు హైకోర్టు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. దీంతోపాటు మరో కేసులో ఆశారాం బాపు దోషిగా తేలాడు. 2013లో సూరత్ ఆశ్రమంలో ఓ మహిళపై ఆశారాం బాపు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ కేసులో గుజరాత్ కోర్టు ఆశారాం బాపుని దోషి అని ప్రకటించింది.

Updated Date - Aug 13 , 2024 | 06:06 PM

Advertising
Advertising
<