Floods: వరదల ఎఫెక్ట్.. 38కి చేరిన మృతులు
ABN, Publish Date - Jul 03 , 2024 | 08:21 AM
అసోంలో వరదల(Assam floods) పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత కొన్ని రోజులుగా భారీ వరదలతో అల్లాడుతున్న అసోం ప్రజలు తాత్కాలిక శిబిరాల్లో నివసిస్తున్నారు. ఈ వరదల్లో ఇప్పటివరకు 38 మంది మృత్యువాత చెందగా, గత 24 గంటల్లో వరద నీటిలో మునిగి ముగ్గురు వ్యక్తులు మరణించారు.
అసోం(Assam)లో వరదల(floods) పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత కొన్ని రోజులుగా భారీ వరదలతో అల్లాడుతున్న అసోం ప్రజలు తాత్కాలిక శిబిరాల్లో నివసిస్తున్నారు. దీంతో 20 జిల్లాల్లో 6.71 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. ఈ వరదల్లో ఇప్పటివరకు 38 మంది మృత్యువాత చెందగా, గత 24 గంటల్లో వరద నీటిలో మునిగి ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమైన దిబ్రూగఢ్ జిల్లాలో చిక్కుకుపోయిన 13 మంది మత్స్యకారులను భారత వైమానిక దళం (IAF) రక్షించింది.
బ్రహ్మపుత్ర సహా దాదాపు 13 ప్రధాన నదులు వివిధ ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని, పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ వరదలు కజిరంగా పార్కును కూడా చుట్టుముట్టాయి. దీంతో అసోం సీఎం హిమంత బిస్వా శర్మ గోలాఘాట్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, కజిరంగాలో పరిస్థితిని సమీక్షించారు.
వరదల(Floods) కారణంగా దిబ్రూఘర్ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. ఎగువ అసోంలోని ప్రధాన నగరం వరుసగా ఆరు రోజులు నీటిలో మునిగిపోయింది. 20 జిల్లాల్లో 6,71,167 మంది వరదల వల్ల ప్రభావితమయ్యారని ASDMA బులెటిన్‌లో పేర్కొంది. గడచిన 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారని నిర్ధారించడంతో ఈ ఏడాది రాష్ట్రంలో వరదలు, తుపానులు, కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
బ్రహ్మపుత్ర నది నెమటిఘాట్(జోర్హాట్), తేజ్‌పూర్ (సోనిత్‌పూర్), గౌహతి (కామ్‌రూప్), ధుబ్రిలలో ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దీంతో గౌహతిలోని బోర్జార్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం గోల్‌పరా, బొంగైగావ్, కర్బీ అంగ్లాంగ్, డిమా హసావోలోని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని ASDMA బులెటిన్ తెలిపింది. అప్రమత్తమైన ప్రభుత్వం వరద బాధితులను రక్షించేందుకు 159 మందితోపాటు మొత్తం 614 మంది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) సిబ్బందిని 295 బోట్‌లతో పాటు 54 ప్రదేశాలలో మోహరించారు.
ఇది కూడా చదవండి:
సత్సంగ్‌లో తొక్కిసలాట.. 116 మంది దుర్మరణం
యూపీలో సీట్లన్నీ మాకే వచ్చినా.. ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్
Read Latest National News and Telugu News
Updated Date - Jul 03 , 2024 | 08:27 AM