ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kejriwal Photo row: కేజ్రీవాల్ చిత్రపటంపై భగత్ సింగ్ మనుమడు అభ్యంతరం.. తప్పేంటని ప్రశ్నించిన 'ఆప్'

ABN, Publish Date - Apr 05 , 2024 | 07:16 PM

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ , రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ చిత్రపటాల మధ్య గోడపై వేలాడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చిత్రపటం ఉంచడంపై భగత్ సింగ్ మనుమడు యద్వీందర్ సంధు అభ్యంతరం వ్యక్తం చేశారు. లెజెండ్స్‌తో కేజ్రీవాల్‌ను పోల్చడం చాలా భయంకరంగా ఉందని వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ (Bhagat Singh), రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ (BR Ambedkar) చిత్రపటాల మధ్య గోడపై వేలాడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) చిత్రపటం ఉంచడంపై భగత్ సింగ్ మనుమడు యద్వీందర్ సంధు (Yadvinder Sandhu) అభ్యంతరం వ్యక్తం చేశారు. లెజెండ్స్‌తో ఆయనను (కేజ్రీవాల్) పోల్చడం చాలా భయంకరంగా ఉందని వ్యాఖ్యానించారు.


''ఈరోజు ఉదయం సునీతా కేజ్రీవాల్ (కేజ్రీవాల్ భార్య) వీడియో సందేశం చూశాను. వీడియో బ్యాక్‌డ్రాప్‌లో భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేడ్కర్‌తో పాటు కేజ్రీవాల్ ఫోటో ఉంచడం చాలా భయంకరంగా అనిపించింది. లెజెండ్స్‌తో ఆయనను పోల్చే ప్రయత్నం చేశారు. ఇలాంటి ప్రయత్నాలకు దూరంగా ఉండాలని ఆప్‌ని కోరుతున్నారు. భగత్ సింగ్, అబేంద్కర్ వంటి లెజెండ్స్ అడుగుజాడలను అనుసరించాలే కానీ వారితో పోల్చుకోరాదు'' అని సంధు పేర్కొన్నారు.

Sunita Kejriwal: సునీతా ది బెస్ట్... ఆప్ మంత్రి సౌరబ్ భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు


వారితో కేజ్రీవాల్‌కు పోలికా?: కిరణ్ రిజిజు

భగత్ సింగ్, అంబేడ్కర్ చిత్రపటాల మధ్య కేజ్రీవాల్ చిత్రపటం ఉంచిన వివాదంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెంటనే స్పందించారు. భగత్ సింగ్ మనుమడి సెంటిమెంట్లను గౌరవించాలని ఆయన అన్నారు. ''గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడితో కేజ్రీవాల్‌ను పోలుస్తారా? భగత్ సింగ్ దేశస్వాతంత్ర్యం కోసం పోరాడారు. కేజ్రీవాల్ బహిరంగంగానే ఇండియా వ్యతిరేక శక్తులకు మద్దతిచ్చారు. అవినీతి ఆరోపణలతో సిట్టింగ్ సీఎంలు, మంత్రులు, ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు అరెస్టు కావడం ఇదేమీ మొదటిసారి కాదు. అయితే కేజ్రీవాల్‌ తరఫున మాత్రమే కొన్ని విదేశీ శక్తులు ఎందుకు గొంతు వినిపిస్తున్నాయి? ఇండియాకు వ్యతిరేకంగా మావోయిస్టులు, టుక్డే టుక్డే గ్యాంగ్‌ల ఎజెండా బయటపడింది'' అని రిజిజు ట్వీట్ చేశారు.

AAP MP Sanjay Singh: కేజ్రీవాల్, సిసోడియా అమాయకులు, జైలు నుంచే పాలన..


ఫోటో ఉంటే తప్పేంటి?

కాగా, భగత్ సింగ్‌ పక్కన ఎవరైనా ఫోటో ఉంచితే అందులో తప్పేంటని ఆప్ నేత సంజయ్ సింగ్ సమర్ధించారు. ''ఇందులో సమస్య ఏముంది? అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కన్వీనర్. భగత్ సింగ్‌తోనో, అంబేద్కర్‌తోనే ఆయన ఫోటో ఉంటే సమస్య ఏమిటి? మేము వారి అడుగుజాడల్లో నడుస్తున్నాం. వారితో సమానమని మేము చెప్పడం లేదు. జనం కూడా భగత్ సింగ్, నేతాజీ, అంబేద్కర్‌లతో సెల్ఫీలు దిగుతుంటారు. ఎన్నికల ప్రచారంలో కూడా రాజకీయ నేతలు అలాంటి లెజెండ్స్‌తో ఫోటోలు షేర్ చేస్తుంటారు'' అని సంజయ్ సింగ్ తన వాదన వినిపించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 05 , 2024 | 07:16 PM

Advertising
Advertising