Ayodhya rape case: ఎస్పీ నేత అక్రమ బేకరీపై యోగి 'బుల్డోజర్' యాక్షన్
ABN, Publish Date - Aug 03 , 2024 | 03:32 PM
అక్రమార్కులపై యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్ చర్యలు కొనసాగిస్తోంది. ఆగస్టు 2న 'అయోధ్య రేప్ కేసు'లో నిందితుడిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ నేత మొయీద్ ఖాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో జిల్లా యంత్రాగం శనివారంనాడు బుల్డోజర్ యాక్షన్‌కు దిగింది. ఆయన పేరుతో ఉన్న బేకరీని బుల్డోజర్‌తో నేలమట్టం చేసింది.
లక్నో: అక్రమార్కులపై యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్ చర్యలు (Buldozer action) కొనసాగిస్తోంది. ఆగస్టు 2న 'అయోధ్య రేప్ కేసు'లో నిందితుడిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ నేత మొయీద్ ఖాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో జిల్లా యంత్రాగం శనివారంనాడు బుల్డోజర్ యాక్షన్‌కు దిగింది. ఆయన పేరుతో ఉన్న బేకరీని బుల్డోజర్‌తో నేలమట్టం చేసింది.
మొయీద్ ఖాన్ నడుపుతున్న బేకరిపై ఫుడ్ సేఫ్టీ డిప్యూటీ కమిషనర్ రెయిడ్ చేశారు. బేకరిలో తయారైన ఉత్పత్తులను పరీక్షించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. భదర్సాలో 'ఎవోన్ బేకరి' పేరుతో దీనిని మొయిద్ ఖాన్ నడుపుతున్నారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజకరణ్ నాయర్ ఒక బుల్డోజర్‌తో కలిసి బేకరి ఉన్న స్థలానికి చేరుకుని ప్రాపర్టీ మెజర్‌మెంట్ చేపట్టాను. అనంతరం బుల్డోజర్ యాక్షన్ చేపట్టారు. అక్రమంగా బేకరీని నడుపుతున్నట్టు నిర్దారణ కావడంతో దానికి సీల్ వేశామని, అనంతరం కూల్చివేత పనులు చేపట్టాని ఎస్‌డీఎం అశోక్ కుమార్ తెలిపారు. ఒక చెరువు చుట్టూ అక్రమంగా నిర్మించిన ప్రహరీగోడను సైతం అధికారులు కూల్చేశారు.
CM visit: పారిస్ వెళ్లేందుకు సీఎంకు అనుమతి నిరాకరణ
యోగిని కలిసిన కలిసిన బాధితురాలి తల్లి
అయోధ్యలోని బదర్సా ప్రాంతంలో తన కుమార్తెపై అత్యాచారం జరగడంతో బాధితురాలి తల్లి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఇటీవల కలుసుకుని ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా యంత్రాగం వెంటనే రంగంలోకి దిగారు. అత్యాచారం కేసు నమోదు చేయడంలోనూ, తగిన చర్య తీసుకోవడంలోనూ జాప్యం చేసిన పోలీస్ చౌకీ ఇన్‌చార్జి, స్టేషన్ ఇన్‌చార్జిని సస్పెండ్ చేసారు. కేసులో ప్రధాన నిందితుడైన మొయిద్ ప్రాపర్టీపై విచారణ చేపట్టారు. పార్టీలతో సంబంధం లేకుండా క్రిమినల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఇటీవల తెలిపారు.
For Latest News and National News Click Here
Updated Date - Aug 03 , 2024 | 03:32 PM