ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bahraich Violence: యూపీలో చెలరేగిన హింస.. ఆసుపత్రి, దుకాణాలు దగ్ధం

ABN, Publish Date - Oct 14 , 2024 | 03:20 PM

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో దుర్గా విగ్రహ నిమజ్జన ఉరేగింపులో ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒక యువకుడు మృతి చెందడంతో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

లక్నో: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని బహ్రాయిచ్‌లో దుర్గా విగ్రహ నిమజ్జన ఉరేగింపులో ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒక యువకుడు మృతి చెందడంతో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతుని బంధువులతో పాటు వేలాది వందలాది నిరసనకారులు మృతదేహాన్ని తీసుకుని మహిసి తహసిల్ కార్యాలయానికి చేరుకున్నారు. పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పలువురు ఆందోళన కారులు ఒక ప్రైవైటు ఆసుపత్రి, ద్విచక్రవాహనాల దుకాణంతో సహా పలు ఆస్తులకు నిప్పుపెట్టారు. దీంతో పోలీసు బలగాలు హుటాహుటిన రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.

Z category Security: కేంద్ర మంత్రికి 'జడ్' కేటగిరి భద్రత


ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు హోం ఏసీఎస్, శాంతి భద్రతల ఏడీజీ ఘటనా స్థలికి చేరుకున్నట్టు బహ్రాయిచ్ ఎస్‌పీ వ్రిందా శుక్లా తెలిపారు. పూర్తి బలగాలను రంగంలోకి దింపి పరిస్థితిని అదుపులోనికి తెచ్చామన్నారు. కాగా, మృతుని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సురేశ్వర్ సింగ్ నచ్చచెప్పి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని ఖననం చేసేందుకు వారు అంగీకరించారు. హింసాకాండకు పాల్పడినట్టు చెబుతున్న 30 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.


శాంతికి భంగం కలిగిస్తే ఊరుకోం: డిప్యూటీ సీఎం

కాగా, బహ్రాయిచ్ హింసాకాండను ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఖండించారు. రాష్ట్రంలో శాంతిసామరస్యాలకు భంగం కలిగించే ఎలాంటి కుట్రలను సహించేది లేదన్నారు. అల్లరిమూకలకు రక్షణ కల్పిస్తూ వస్తున్న కొందరు తిరిగి చురుకుగా పనిచేస్తున్నారని, వారి పట్ల అత్యంత అప్రమత్తంగా, పూర్తి నిఘా వేసి ఉంచామని చెప్పారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తును దెబ్బతీస్తే సహించేది లేదని, చట్టాన్ని అతిక్రమించే వారికి కఠిన శిక్ష పడుతుందని, బాధితులకు పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రజలు అల్లర్లకు దారుంగా ఉండాలని, ప్రశాంతతను పాటించాలని విజ్ఞప్తి చేశారు.


ఏం జరిగింది?

మన్సూర్ గ్రామంలోని మహరాజ్ గంజ్ బజార్‌లో దుర్గా నిమజ్జనం ఊరేగింపుతో కలిసి వస్తున్న రామ్ గోపాల్ మిశ్రా అనే వ్యక్తి అల్లర్లి మూకలు విసిరిన రాళ్లు, కాల్పుల్లో మరణించాడు. మిశ్రాతో పాటు సుమారు డజను మంది ఈ హింసాకాండలో గాయపడ్డారు. సమాచారం తెలియగానే పలు హిందూ సంస్థలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగాయి. దీంతో హర్డి పోలీస్ స్టేషన్ హెడ్ ఎస్‌కే వర్మ, మహిసి ఔట్ పోస్ట్ ఇన్‌చార్జి శివకుమార్‌ను ఎస్పీ సస్పెండ్ చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేసి ఆయన గ్రామానికి సోమవారం ఉదయం చేర్చడంతో తిరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


యోగి వార్నింగ్

దుర్గా నిమజ్జనం సందర్భంగా చెలరేగిన హింసను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఖండించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అల్లర్లను రెచ్చగొట్టే వాళ్లను ఎంతమాత్రం సహించేది లేదని అన్నారు. దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులు అధికారులను ఆదేశించారు. విగ్రహ నిమజ్జనాలు కొనసాగాల్సిందేనని, సకాలంలో విగ్రహాలు నిమజ్జనం చేయాల్సిందిగా రెలిజియస్ ఆర్గనేజేషన్లకు సమాచారం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.


మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

ఇది కూడా చదవండి..

‘ఆయుష్మాన్‌’లో వృద్ధులకు మరిన్ని ప్రయోజనాలు

Updated Date - Oct 14 , 2024 | 03:30 PM