ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bombay High Court: కళాశాల ఆవరణలో హిజాబ్‌పై నిషేధం సబబే

ABN, Publish Date - Jun 27 , 2024 | 04:39 AM

కళాశాల ఆవరణల్లో హిజాబ్‌ ధారణపై నిషేధం విధించడం సబబేనని బుధవారం బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. ఏకరూప వస్త్రధారణ దృష్ట్యా విద్యార్థులు హిజాబ్‌, బుర్ఖా, నకాబ్‌, టోపీలను ధిరించకుండా నిషేఽధం విధించవచ్చని తెలిపింది.

ముంబయి, జూన్‌ 26: కళాశాల ఆవరణల్లో హిజాబ్‌ ధారణపై నిషేధం విధించడం సబబేనని బుధవారం బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. ఏకరూప వస్త్రధారణ దృష్ట్యా విద్యార్థులు హిజాబ్‌, బుర్ఖా, నకాబ్‌, టోపీలను ధిరించకుండా నిషేఽధం విధించవచ్చని తెలిపింది. చెంబూర్‌ ట్రాంబే ఎడ్యుకేషన్‌ సొసైటీ ముంబయిలో నిర్వహిస్తున్న ఎన్‌జీ ఆచార్య, డి.కె.మరాఠే కళాశాలల్లో హిజాబ్‌ ధారణను నిషేధిస్తూ యాజమాన్యం ఆదేశాలు ఇచ్చింది.

దీనిని సవాలు చేస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. కళాశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయం తమ ప్రాథమిక, మతపరమైన హక్కులకు భంగకరమని, వ్యక్తిగత గోప్యతను హరించేదని పేర్కొన్నారు. కళాశాలల తరఫు న్యాయవాది ఈ వాదనలను ఖండించారు. కేవలం క్రమశిక్షణలో భాగంగా డ్రెస్‌ కోడ్‌ను నిర్ణయించారే తప్ప ఏ మతానికి వ్యతిరేకంగా కాదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం డ్రెస్‌ కోడ్‌ నిర్ణయాన్ని సమర్థించింది.

Updated Date - Jun 27 , 2024 | 07:10 AM

Advertising
Advertising