ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bangalore: బలపడుతున్న ‘బంధం’

ABN, Publish Date - Aug 09 , 2024 | 11:46 AM

తెలుగు రాష్ట్రాలతో కర్ణాటక(Karnataka)కు దశాబ్దాల కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల అవి మరింత బలపడుతున్నాయి. కొన్నేళ్లుగా జలవనరులకు సంబంధించి ఒకటి రెండు సభలు మినహా మిగిలిన విభాగాలపై చర్చలు జరిగిన దాఖలాలు లేవు.

- ఏపీ, కర్ణాటక మధ్య పెరుగుతున్న సంబంధాలు

- డీసీఎం పవన్‌కల్యాణ్‌కు అపూర్వ స్వాగతం

- అటవీ సంపద రక్షణకు పలు నిర్ణయాలు

- వన్యప్రాణులపై దాడులు అరికట్టడంపై చర్చ

బెంగళూరు: తెలుగు రాష్ట్రాలతో కర్ణాటక(Karnataka)కు దశాబ్దాల కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల అవి మరింత బలపడుతున్నాయి. కొన్నేళ్లుగా జలవనరులకు సంబంధించి ఒకటి రెండు సభలు మినహా మిగిలిన విభాగాలపై చర్చలు జరిగిన దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో రెండునెలల కిందటే ఏర్పడిన ఉమ్మడి ప్రభుత్వం సరికొత్త విధానానికి తెరలేపింది. రోజుల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్‌ డీసీఎం పవన్‌కళ్యాణ్‌(DCM Pawan Kalyan) పంపిన ప్రతిపాదనలపై కర్ణాటక అటవీశాఖా మంత్రి ఈశ్వర్‌ఖండ్రే సానుకూలంగా స్పందించారు. గురువారం బెంగళూరు విధానసౌధ వేదికగా రెండు రాష్ట్రాలకు సంబంధించి కేవలం అటవీశాఖకు మాత్రమే కాకుండా వివిధ అంశాలపై చర్చలు సాగాయి.


అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణే కీలకం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు అనుబంధంగా వివిధ ప్రాంతాలలో సరిహద్దులు ఉన్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో ఏనుగుల దాడులు, ఇదే జిల్లాలో విస్తారంగా ఉండే రక్తచందనం అక్రమ రవాణా పెను సవాల్‌పై చర్చలు జరిగాయి. డీసీఎం పవన్‌కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ తరపున ప్రతిపాదించిన వివిధ అంశాలకు మంత్రి ఖండ్రే సమ్మతించారు. ప్రధానంగా ఏడు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.

వీటిలో ఎపీ నుంచి అక్రమంగా రవాణా అయ్యే ఎర్రచందనంను సమగ్రంగా నియంత్రణ చేసేలా జరిపిన చర్చలకు అంగీకరించారు. ఎపీ నుంచి కర్టాటక మీదుగా రవాణా చేసేందుకు ప్రయత్నించిన రూ.140 కోట్ల విలువైన ఎర్రచందనంను అటవీ అధికారులు స్వాధీనం చేసుకోవడంపై పవన్‌కల్యాణ్‌ ప్రత్యేకంగా అభినందించారు. వన్యప్రాణుల నుంచి మనుషుల రక్షణపై చర్చించారు. కర్ణాటకలోని వివిధ అభయారణ్యాలలో వందలాది శిక్షణ పొందిన(కుమ్కీ) ఏనుగులు ఉన్నాయి. ఇప్పటికే 67 ఏనుగులను వివిధ రాష్ట్రాలకు పంపారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఏనుగుల దాడులు పెరగడంతో ఎనిమిది ‘కుమ్కీ’ ఏనుగులు అవసరంగా ఇప్పటికే పంపిన ప్రతిపాదనల విషయమై కూడా చర్చించారు. ఎకో టూరిజం, వన్యప్రాణుల గురించి శిక్షణలు, ఏనుగుల నుంచి రక్షణకు సంబంధించి చైతన్యం, అటవీ, వన్యప్రాణులకు సంబంధించి ఇరురాష్ట్రాల మధ్య జ్ఞానాన్ని పెంచుకునే అంశాలపై తరచూ సమీక్షలు జరుపదలచారు. తొలివిడతగా ఇద్దరు మంత్రుల మధ్య జరిగిన చర్చలు కావడంతో అవగాహనకు వచ్చారు. ఇవే విషయాలపై త్వరలోనే ఒక ఒప్పందం చేసుకోదలచారు. మరో నాలుగు రోజులలోనే మానవాళిపై ఏనుగుల దాడులు అనే విషయమై జాతీయ స్థాయి చర్చాగోష్టి బెంగళూరులో జరుగనుంది. ఇందులో రెండు రాష్ట్రాల సమస్యలను పరిగణలోకి తీసుకోవాలని భావించారు. ఏడాది వ్యవఽధిలో ఏనుగుల దాడిలో కర్ణాటక పరిధిలో 30మందికి పైగాను ఏపీలో 20మందికి పైగా మృతి చెందిన అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. రెండు రాష్ట్రాలలోను ఏనుగులు, పులులు, చిరుతలు ఉన్నాయి. వీటి సంరక్షణపైనా చర్చలు జరిపారు.


అధికారులకు పవన్‌ అభినందన

ఆంధ్ర నుంచి అక్రమంగా కర్ణాటకకు వచ్చిన రూ.140కోట్ల విలువైన రక్తచందనాన్ని పట్టివేసినందుకు పవన్‌కళ్యాణ్‌ ప్రత్యేకంగా కర్ణాటక అటవీశాఖాధికారులను అభినందించారు. ఇదే సందర్భంలోనే మంత్రి ఈశ్వర్‌ఖండ్రే తెలుగువారితో తవకు సన్నిహిత సంబంధమన్నారు. బీదర్‌ ప్రాంతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో సంబంధాలు కలిగి ఉన్నందున ఎన్నో ఏళ్ళుగా వ్యాపార, వాణిజ్య, బంధువుల రూపంలో సత్‌సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. భావనలు వేరైనా రెండురాష్ట్రాల ప్రజల అభిప్రాయాలు ఒక్కటే అనడం ప్రత్యేకం.


దోపిడీ చేసే హీరోయిజం..

అటవీ సంపదను దోచేసేలాంటి సినిమాకు సంబంధించి పవన్‌కళ్యాణ్‌ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ళ కిందట ‘గంధదగుడి’ అనే సినిమా అటవీ సంపదను రక్షించే విధంగా ఉందని నేటి సినిమా దోపిడీనే హీరోయిజంగా మారిందని చేసిన వ్యాఖ్యలు గంటల వ్యవధిలోనే తెలుగు రాష్ట్రంలో సంచలనమైంది. పుష్ప సినిమా పూర్తిగా ఎర్రచందనం దోపిడీ చేసే సినిమా కావడం విశేషం.


ముఖ్యమంత్రిని కలిసిన పవన్‌కళ్యాణ్‌

బెంగళూరు పర్యటనకు వచ్చిన డీసీఎం పవన్‌కళ్యాణ్‌ అధికారిక నివాసం కావేరీలో సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah)ను కలిశారు. డీసీఎం హోదాలో తొలిసారి వచ్చిన పవన్‌కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేక అభిమానంతో స్వాగతించి సత్కరించారు. కాగా అటవీ మంత్రి ఈశ్వర్‌ఖండ్రేను శాలువాతో సత్కరించిన పవన్‌కళ్యాణ్‌ తిరుమల ప్రసాదం, వెంకటేశ్వరస్వామి విగ్రహం, అరకు కాఫీ ప్యాకెట్‌లు అందించారు. ఈశ్వర్‌ఖండ్రే వివిధ న మూనాలతో పాటు శాలువాతో సన్మానం చేశారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 09 , 2024 | 11:46 AM

Advertising
Advertising
<