Bangalore: ఉత్తర కర్ణాటక అభివృద్ధికి రాష్ట్ర విభజన అనివార్యం..
ABN, Publish Date - Jun 30 , 2024 | 01:15 PM
విశ్వ ఒక్కలిగ మహా సంస్థానం మఠాధిపతి చంద్రశేఖరస్వామిజీ(Chandrasekharaswamyji) రెండు రోజుల వ్యవధిలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కెంపేగౌడ జయంతిలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) సభలో ఉండగానే సీఎం పదవికి రాజీనామా చేసి డీకే శివకుమార్‌కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
- మరో వివాదానికి తెరలేపిన చంద్రశేఖర స్వామిజీ
బెంగళూరు: విశ్వ ఒక్కలిగ మహా సంస్థానం మఠాధిపతి చంద్రశేఖరస్వామిజీ(Chandrasekharaswamyji) రెండు రోజుల వ్యవధిలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కెంపేగౌడ జయంతిలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) సభలో ఉండగానే సీఎం పదవికి రాజీనామా చేసి డీకే శివకుమార్‌కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మరింతమంది డీసీఎం పదవులకు అవకాశం కల్పించాలనే డిమాండ్ సాగుతున్న తరుణంలో స్వామిజీ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వివాదంపై శనివారం ఓ మీడియాతో మాట్లాడిన సందర్భంలోనే చంద్రశేఖర్‌స్వామిజీ ఉత్తర కర్ణాటక అభివృద్ధి జరగాలంటే రాష్ట్ర విభజన జరగాల్సిందే అన్నారు. కర్ణాటకను ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటకగా విభజన చేయాలని కోరారు. అప్పుడే వెనుకబడిన ఉత్తర కర్ణాటకలో అభివృద్ధి పనులు సాధ్యమవుతాయని అన్నారు. ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రం చేయాలని పలుమార్లు డిమాండ్ చేసిన మాజీ మంత్రి ఉమేశ్‌కత్తి వ్యాఖ్యలను గుర్తు చేశారు.
ఇదికూడా చదవండి: Minister Satish: 2028లో నేనూ సీఎం రేసులో ఉంటా..
రాష్ట్రాన్ని విభజించాలని డిమాండ్ చేసే స్వామిజీ బెంగళూరు విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించారు. బెంగళూరు నగరాన్ని విభజన చేయరాదని అన్నారు. కెంపేగౌడ అంటే బెంగళూరు అని, ఓ మంచి నగరం కావాలనే కెంపేగౌడ ఆశయాన్ని పాడుచేయరాదని పేర్కొన్నారు. పాలన, లేదా ఇతర కారణాలు చూపి బెంగళూరు విభజన సరికాదన్నారు. ఇదే సందర్భంలోనే ముఖ్యమంత్రి పదవిని సిద్దరామయ్య వదులుకుని డీకే శివకుమార్‌కు అప్పగించాలన్న ఆయన ప్రతిపాదనను సమర్థించుకున్నారు. తాను డీకే శివకుమార్ కష్టం చూశానని, రాష్ట్రంలో 135 మంది ఎమ్మెల్యేల విజయం వెనుక ఆయన కష్టం ఉందని తెలిపారు. పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారో వారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం సముచితం అన్నారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలనేది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 30 , 2024 | 01:15 PM