ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bangalore: 10లోగా కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా..

ABN, Publish Date - Mar 04 , 2024 | 01:09 PM

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈనెల 10లోగానే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలోనే సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌(CM Siddaramaiah, DCM DK Shivakumar)లు ఢిల్లీ వెళ్లనున్నారు.

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈనెల 10లోగానే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలోనే సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌(CM Siddaramaiah, DCM DK Shivakumar)లు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే కేపీసీసీలో ఖరారైన జాబితాను కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీకి పంపారు. ఢిల్లీ వెళ్లిన ఇదే జాబితాను ఖరారు చేసే అవకాశం ఉంది. తొలి విడతలో 10-12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న మేరకు మైసూరు నుంచి లక్ష్మణ్‌ లేదా యతీంద్ర సిద్దరామయ్య, మండ్య నుంచి స్టార్‌ చంద్రు, తుమకూరు - ముద్ద హనుమేగౌడ లేదా డీసీ శంకర్‌, కోలారు - మునియప్ప, చిత్రదుర్గ - చంద్రప్ప, ఉడుపి-చిక్కమగళూరు - జయప్రకాశ్‌ హెగ్డే, బెంగళూరు గ్రామీణ - డీకే సురేశ్‌, బెంగళూరు సెంట్రల్‌ - రిజ్వాన్‌ హర్షద్‌ లేదా టబు గుండూరావు, బెంగళూరు ఉత్తర - కుసుమ హనుమంతరాయప్ప, బెంగళూరు దక్షిణ - సౌమ్యరెడ్డి, ఉత్తరకన్నడ - అంజలి నింబాల్కర్‌, చిక్కబళ్ళాపుర - వీరప్పమొయిలీ లేదా రక్షా రామయ్యలుగా ఉన్నాయి. చిక్కబళ్ళాపుర నుంచి బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బచ్చేగౌడ కోడలు, ఎమ్మెల్యే శరత్‌ భార్య ప్రతిభా శరత్‌ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. బచ్చేగౌడ ఇటీవల కొంతకాలంగా కాంగ్రెస్ తో చనువుగా ఉంటున్నారు. ఆయన కుమారుడు శరత్‌ ప్రస్తుతం హొస్కోటె కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే.

Updated Date - Mar 04 , 2024 | 01:09 PM

Advertising
Advertising