ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bangalore: హంపిలో ‘చిరుత’ కలకలం..

ABN, Publish Date - Oct 22 , 2024 | 01:29 PM

ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్రం హంపిలో సోమవారం సాయంత్రం అక్కచెల్లెలు కొండపైభాగంలో చిరుత(Cheetah) ప్రత్యక్షమైంది. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. నెల రోజులుగా ఈ ప్రాంతంలోని నవదిబ్బ, పుష్కరేణి, గజశాల, విజయవిఠల దేవస్థానం పలు ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో చిరుత కనిపిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు.

కంప్లి(బెంగళూరు): ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్రం హంపిలో సోమవారం సాయంత్రం అక్కచెల్లెలు కొండపైభాగంలో చిరుత(Cheetah) ప్రత్యక్షమైంది. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. నెల రోజులుగా ఈ ప్రాంతంలోని నవదిబ్బ, పుష్కరేణి, గజశాల, విజయవిఠల దేవస్థానం పలు ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో చిరుత కనిపిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. మరోసారి కమలాపురం నుంచి హంపి మార్గంలో కనిపించడంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. సమీప కొండల్లో నుంచి తరచూ వన్యప్రాణులు ప్రవేశిస్తున్నాయంటున్నారు. అధికారులు బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని పర్యాటకులు కోరుతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: ఈసారికి వానరాలకేనా...!


.....................................................................

ఈ వార్తను కూడా చదవండి:

........................................................................

Bangalore: మరోసారి ప్రజ్వల్‌కు నిరాశే..!

- బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

- నాలుగు నెలలుగా జైలులోనే

బెంగళూరు: మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ(Former MP Prajwal Revanna)కు మరోసారి హైకోర్టులో చుక్కెదురయ్యింది. లైంగిక దాడులకు సంబంధించి మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ మూడు కేసులలో దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌లను కొట్టివేస్తూ హైకోర్టు ధర్మాసనం సోమవారం ఆదేశించింది. దీంతో ప్రజ్వల్‌ రేవణ్ణకు మరింత కాలం జైలులోనే గడపక తప్పదని నిర్ధారించినట్లు అయ్యింది. రెండు అత్యాచార కేసులతో పాటు మహిళ అశ్లీల దృశ్యాలను రికార్డు చేసుకున్న వివాదానికి సంబంధించి ఆయనపై కేసులు నమోదయ్యాయి. మూడు కేసుల నుంచి విముక్తి పొందేందుకు ప్రజ్వల్‌ తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి ఎం నాగప్రసన్న ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ప్రజ్వల్‌ తరపున న్యాయవాది జి ఆరుణ్‌ వాదనలు వినిపించారు.


దర్యాప్తు జరుపుతున్న సిట్‌ తరుపున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రొఫెసర్‌ రవివర్మకుమార్‌ వాదనలు వినిపించారు. ప్రస్తుతానికి దాఖలు చేసిన మూడు కేసుల బెయిల్‌ పిటిషన్లను ధర్మాసనం కొట్టవేసింది. హాసన్‌ జిల్లా పంచాయతీ మాజీ సభ్యురాలిపై అత్యాచార కేసులో బెయిల్‌ పిటిషన్‌పై రెండురోజులలో తీర్పు ప్రకటిస్తామన్నారు. ఒకవేళ ఈకేసులో బెయుల్‌ మంజూరైనా మిగిలిన కేసుల్లో బయటకు వచ్చే అవకాశం లేనట్లు అయ్యింది. ప్రజ్వల్‌ రేవణ్ణ 4 నెలలకుపైగా జైలులోనే గడుపుతున్నారు. బెయిల్‌కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సుదీర్ఘంగా విచారణ సాగింది.


ఇదికూడా చదవండి: Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!

ఇదికూడా చదవండి: KTR : రేవంత్‌ చెప్పేవి పచ్చి అబద్ధాలు!

ఇదికూడా చదవండి: TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్‌ 1912

ఇదికూడా చదవండి: Thummala: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 22 , 2024 | 01:29 PM