ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bangalore: గుండెల్లో గుడి కట్టుకున్న అభిమానం..

ABN, Publish Date - Sep 27 , 2024 | 10:57 AM

తన అభిమాన నటుడికి గుడి కట్టించాడు ఆ అభిమాని. హావేరి జిల్లా యలగచ్చ గ్రామంలో దివంగత పునీత్‌రాజ్‌కుమార్‌(Puneeth Rajkumar) పేరిట నిర్మించిన ఆలయాన్ని అశ్విని పునీత్‌ రాజ్‌కుమార్‌(Ashwini Puneeth Rajkumar) గురువారం లాంఛనంగా ప్రారంభించారు.

- దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌కు ఆలయం కట్టిన అభిమాని

- ఆవిష్కరించిన అప్పు భార్య అశ్విని

బెంగళూరు: తన అభిమాన నటుడికి గుడి కట్టించాడు ఆ అభిమాని. హావేరి జిల్లా యలగచ్చ గ్రామంలో దివంగత పునీత్‌రాజ్‌కుమార్‌(Puneeth Rajkumar) పేరిట నిర్మించిన ఆలయాన్ని అశ్విని పునీత్‌ రాజ్‌కుమార్‌(Ashwini Puneeth Rajkumar) గురువారం లాంఛనంగా ప్రారంభించారు. సినీ రంగంలో ఎంతో పేరొంది కర్ణాటక రత్నగా పేరొందిన పునీత్‌రాజ్‌కుమార్‌కు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పునీత్‌ ఆకస్మిక మరణంతో ఎందరో అభిమానులు గుండెలు పగిలిన సంగతి తెలిసిందే. అప్పుకు రాష్ట్రంలో అభిమానులకు తావులదు.

ఇదికూడా చదవండి: సిద్దరామయ్యకు రాహుల్‌ మద్దతు


యలగచ్చ గ్రామానికి చెందిన ప్రకాశ్‌ తన ఇంటి సొంతస్థలంలోనే నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌(Actor Puneeth Rajkumar)కు ఆలయాన్ని నిర్మించారు. గురువారం ఆరు అడుగుల పునీత్‌ విగ్రహాన్ని ఆయన భార్య అశ్విని లాంఛనంగా ఆవిష్కరించారు. తొలుత ఆమె ఉడచ్చమ్మ దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. అశ్వినికి గ్రామస్తులు ఆత్మీయంగా పూర్ణకుంభాలతో స్వాగతించారు. పునీత్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అభిమాని ప్రకాశ్‌ కుమార్తెకు ఆపేక్షా అని నామకరణం చేశారు.


అభిమానులే నటులకు దేవుళ్లతో సమానమని అశ్విని అభిప్రాయపడ్డారు. ఇన్నేళ్లయినా పునీత్‌ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న అభిమానులను తాను మరువలేనని, వారి రుణం తీర్చుకోలేదని పేర్కొంటూ కన్నీళ్లు పెట్టారు. కాగా ప్రకాశ్‌ మాట్లాడుతూ 8 నెలలుగా పునీత్‌ ఆలయ నిర్మాణం కోసం పాదరక్షలు ధరించలేదన్నారు. గురువారం ఆలయం ప్రారంభం కావడంతో వేసుకుంటున్నట్టు తెలిపారు. పెద్దసంఖ్యలో అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు.


దికూడా చదవండి: Harish Rao: పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులివ్వండి

ఇదికూడా చదవండి: కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకోకండి

ఇదికూడా చదవండి: KCR: కొండా లక్ష్మణ్‌ బాపూజీ కృషి అజరామరం

ఇదికూడా చదవండి: అబ్బో.. వీళ్ల పైత్యం మామూలుగా లేదుగా.. మెట్రోరైల్వేస్టేషన్‌లో అశ్లీల రీల్స్‌..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 27 , 2024 | 10:57 AM