Bangalore: ‘నా కొడుకులను తుపాకీతో కాల్చి చంపండి’
ABN, Publish Date - Aug 22 , 2024 | 02:13 PM
‘నా కొడు కులతో పరువు పోతోందని వారిద్దరినీ తుపాకీతో కాల్చి చంపండని’ హుబ్బళ్ళి(Hubballi) నగర పోలీస్ కమిషనర్ ఎదుట తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. హుబ్బళ్ళిలో రెండు రోజులక్రిందట రౌడీల మధ్య గ్యాంగ్‌వార్ జరిగింది.
- పోలీస్ కమిషనర్ ఎదుట తండ్రి ఆవేదన
బెంగళూరు: ‘నా కొడు కులతో పరువు పోతోందని వారిద్దరినీ తుపాకీతో కాల్చి చంపండని’ హుబ్బళ్ళి(Hubballi) నగర పోలీస్ కమిషనర్ ఎదుట తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. హుబ్బళ్ళిలో రెండు రోజులక్రిందట రౌడీల మధ్య గ్యాంగ్‌వార్ జరిగింది. రౌడీషీటర్ అఫ్తాబ్ కరడిగుడ్డపై పోలీసులు కాల్పులు జరిపారు. రౌడీషీటర్‌లు జావూద్ బేఫారి, అఫ్తాబ్ కరడిగుడ్డ ముఠాల మధ్య గొడవ లు ఉన్నాయి. పాత కక్షలతో వారు గ్యాంగ్‌వార్‌కు పాల్ప డ్డారు. జావూద్‌పై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులు అఫ్తాబ్ కాలికి కాల్పులు జరిపి పట్టుకున్నారు.
ఇదికూడా చదవండి: CBI: కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకు సీబీఐ సంచలన రిపోర్ట్
ఆ తర్వాత రౌడీ షీటర్ ఇంటిపై శశికుమార్ నేతృత్వంలో దాడి జరిపారు. దీంతో అఫ్తాబ్ తండ్రి మహ్మద్‌గౌస్ బుధవారం కమిషనర్ ఎదుట తన గోడు వెళ్లబోసు కున్నారు. మహ్మద్ గౌస్ మాట్లాడుతూ నా ఇద్దరు కొడుకులు దారి తప్పారని కంటతడిపెట్టారు. హత్యా యత్నంలో ఇద్దరు పాల్గొన్నారని, వారి నుంచి మర్యాద పోయిందని, ఇద్దరినీ తుపాకీతో కాల్చి చంపాలని కన్నీరు పెట్టారు. ఈమేరకు కమిషనర్ శశి కుమార్ తీవ్రంగా హెచ్చరించారు. బుద్ధి చెప్పకపోతే మేమే తగిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.
......................................................................
ఈ వార్తను కూడా చదవండి:
.......................................................................
Bangalore: బళ్లారి ఏపీఎంసీలో లుకలుకలు
- ఉపాధ్యక్ష స్థానానికి హులెప్ప రాజీనామా
బళ్లారి(బెంగళూరు): బళ్లారి వ్యవసాయ ఉత్పత్తుల సమితికి రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన పాలనా మండలిలో అపుడే లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఏపీఎంసి ఉపాధ్యక్ష స్థానానికి బుధవారం హులెప్ప రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అసిస్టెంట్ సెక్రటరీ ఎర్రిగౌడకు అందజేసినట్లు ఆయన తెలిపారు. బళ్ళారి ఏపీఎంసి పాలక మండలి కాలపరిమితి గత ఏడాది శాసనసభ ఎన్నికల కోడ్‌తోనే ముగిసిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు ఏడాది పాటు వివిధ మండళ్ళకు సంబంధించి నామినేటెడ్ స్థానాలు భర్తీ చేయలేదు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల కోడ్ ప్రకటనకు ముందే రాష్ట్రంలో పలు మండళ్ళు, ఏపీఎంసిలకు నామినేటెడ్ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇందులో భాగంగా బళ్ళారి ఏపీఎంసికి ఈ సంవత్సరం మార్చి16న పదకొండు మంది నామినేటెడ్ సభ్యులతో పాలకమండలి ఏర్పాటుచేశారు. ఏపీఎంసి అధ్యక్షుడిగా బళ్లారి నగరానికి చెందిన కట్టెమనె నాగేంద్రప్పను, ఉపాధ్యక్షులుగా గ్రామీణ విభాగం నుంచి కొళగల్లు గ్రామానికి చెందిన హులెప్పతో పాటు మరో 9మంది సభ్యులను నామినేట్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా అఽధ్యక్ష, ఉపాధ్యక్షులు జూన్ 13వ తేదీన అధికార బాధ్యతలు స్వీకరించారు. అయితే బాధ్యతలు స్వీకరించి పట్టుమని రెండు నెలలు గడవకమును పే బళ్ళారి ఏపీఎంసి పాలనా మండలిలో లుకలుకలు ప్రారంభం అయ్యాయి. పాలనా మండలిలో ఎంపికైన వారిలో 9మంది బళ్ళారి రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి నాగేంద్ర మద్దతుదారులే కావడం గమనార్హం. ప్రస్తుతం వాల్మీకి అభివృద్ధి మండలిలో జరిగిన అక్రమాల్లో మాజీ మంత్రి నాగేంద్ర జైలు పాలుకాగా... ఆయన ప్రభావం పరోక్షంగా ఏపీఎంసి పాలనా మండలిపై పడిందని సభ్యులు అంటున్నారు.
తమ నాయకుడు జైలుకు వెళ్ళిన కారణంగా నాగేంద్ర మద్దతు దారులైన ఏపీఎంసి ఉపాధ్యక్షులతో పాటు సభ్యులను చిన్నచూపు చూస్తున్నారని, అందుకు మనసు నొచ్చుకుని ఉపాధ్యక్షులుగా ఎన్నికైన హులెప్ప తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధ్యక్షులు నాగేంద్రప్పతో పాటు మరో సభ్యుడికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉండడంతో బళ్లారి ఏపీఎంసిలో ఏకపక్ష నిర్ణయాలు జరుగుతుండడమే హులెప్ప రాజీనామాకు దారితీసిందని అంటున్నారు. జరిగిన సమావేశాలు పూర్తి స్థాయిలో కోరం లేకుండా ముగిసిన విషయాన్ని బయటకు పొక్కకుండా సభ్యులు, అధికారులు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. రాజీనామాపై ఉపాధ్యక్షులు హులెప్పను వివరణ కోరగా... మండలి నిర్ణయాలు నచ్చడం లేదని, గౌరవం లేని చోట తాను ఇమడలేనని అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉపాధ్యక్షుడి రాజీనామా ఆయన వ్యక్తిగతం
బళ్లారి ఏపీఎంసీ ఉపాధ్యక్ష స్థానానికి హులెప్ప రాజీనామా చేసిన విషయంపై అధ్యక్షులు నాగేంద్రప్పను వివరణ కోరగా, ఉపాధ్యక్షులు రాజీనామా చేసిన విషయం తనకేమి తెలియదని, రాజీనామా చేయడం ఉపాధ్యక్షుల వ్యక్తిగత విషయమని, తానేమి చెప్పలేనని అన్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Aug 22 , 2024 | 02:13 PM