ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bangalore: చాముండేశ్వరి దర్శనానికి స్మార్ట్‌కార్డ్‌..

ABN, Publish Date - Sep 11 , 2024 | 01:42 PM

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, రాచనగరి మైసూరు(Mysore)కు అనుబంధమైన నాడదేవత చాముండేశ్వరి(Chamundeshwari) దర్శనం కోసం సరికొత్త సాంకేతిక విధానం తీసుకొచ్చేందుకు చాముండేశ్వరి అభివృద్ధి ప్రాధికార సిద్ధమైంది. క్యూలైన్లలో రద్దీ తగ్గించడంతోపాటు దర్శనం, పూజ, ప్రసాదభాగ్యను కల్పించేందుకు స్మార్ట్‌కార్డును ప్రవేశపెడుతున్నారు.

- క్యూలైన్లలో రద్దీ తగ్గించే యత్నం

- స్మార్ట్‌ ద్వారా దర్శనం, పూజ, ప్రసాదం పంపిణీ

- నాలుగు విధాలుగా చార్జీలు

బెంగళూరు: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, రాచనగరి మైసూరు(Mysore)కు అనుబంధమైన నాడదేవత చాముండేశ్వరి(Chamundeshwari) దర్శనం కోసం సరికొత్త సాంకేతిక విధానం తీసుకొచ్చేందుకు చాముండేశ్వరి అభివృద్ధి ప్రాధికార సిద్ధమైంది. క్యూలైన్లలో రద్దీ తగ్గించడంతోపాటు దర్శనం, పూజ, ప్రసాదభాగ్యను కల్పించేందుకు స్మార్ట్‌కార్డును ప్రవేశపెడుతున్నారు. చాముండేశ్వరి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. వీరితోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల వాసులు మైసూరు, కొడగు(Kodugu)లో విహారయాత్రతోపాటు రాజరిక వ్యవస్థ, ప్యాలె్‌సను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు చాముండేశ్వరిని దర్శించుకుంటారు.

ఇదికూడా చదవండి: Congress vs BSP: రాహుల్ రిజర్వేషన్ వ్యాఖ్యలపై మాయవతి ఫైర్..


శక్తి గ్యారెంటీ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన మహిళలైనా ఉచితంగా బస్సు ప్రయాణం చేసే వెసులుబాటు ఉండడంతో నిత్యం రద్దీగా సాగుతోంది. ఇటీవల ఆషాఢమాసంలో భక్తులరద్దీని నియంత్రించేందుకు ఆలయ కమిటీ కి సవాలుగా మారింది. మరికొన్ని రోజుల్లోనే ప్రతిష్టాత్మకమైన మైసూరు దసరా ఉత్సవాలు ప్రారంభమవుతుండడంతో మరోసారి రద్దీ పెరిగే అవకాశం ఉంది. మైసూరు చాముండేశ్వరిని దర్శించుకునేందుకు స్మార్ట్‌కార్డును అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. తద్వారా దేవి దర్శనంతోపాటు పూజ, లడ్డూ ప్రసాదం పొందే వెసులుబాటు ఉంటుంది.


నమ్మ మెట్రో తరహాలో స్మార్ట్‌కార్డు..

మెట్రో రైళ్ల ప్రయాణంలో ఉపయోగించే స్మార్ట్‌కార్డు తరహాలోనే చాముండేశ్వరి దేవి దర్శనానికి వచ్చే భక్తులకు స్మార్ట్‌కార్డును ప్రవేశపెడతారు. క్యూఆర్‌ కోడ్‌ ఉపయోగించి స్మార్ట్‌కార్డును పొందవచ్చు. ఏడాదిలో ఎన్నిసార్లు దర్శనం చేసుకోవచ్చు అనేది పొందుపరుస్తారు. అందుకు అనుగుణంగా భక్తులు వారికి అనుకూలం ఉన్నప్పుడు చాముండి కొండలకు చేరుకుని రద్దీ సమస్య లేకుండా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు.


నాలుగు రకాల స్మార్ట్‌కార్డులు..

స్మార్ట్‌కార్డుకు ప్రాధికార నాలుగు విధాలుగా చార్జీలు నిర్ణయించింది. రూ.12వేల కార్డు పొందితే ఏడాదికి 12 సార్లు ఒకరు నేరుగా దర్శనంతోపాటు ఒక లడ్డూ ప్రసాదం పొందవచ్చు. రూ.25వేల విలువైన స్మార్ట్‌కార్డు(Smartcard) పొందితే ఇద్దరు ఏడాదిలో 12సార్లు దర్శనం చేసుకోవచ్చు. వారికి రెండు లడ్డూలు ప్రసాదంగా ఇస్తారు. రూ.50వేల విలువైన స్మార్ట్‌కార్డు పొందితే ఐదుగురికి నేరుగా దర్శనంతోపాటు చెరో 5 లడ్డూలు, అభిషేకం, పంచామృత ప్రసాదం ఇస్తారు. రూ.లక్ష స్మార్ట్‌కార్డు పొందితే 10 మందికి దర్శనం అవకాశం ఉంటుంది. వారి పేరిట ప్రత్యేక పూజలతోపాటు పంచామృత ప్రసాదం, చెరో పది లడ్డూలు ఇస్తారు.


ఆలయం వద్ద ఓ కౌంటర్‌ను ఏర్పాటు చేసి క్యూఆర్‌కోడ్‌ ద్వారా నగదు చెల్లించడం ద్వారా స్మార్ట్‌కార్డు పొందే సౌలభ్యం కల్పిస్తారు. డిజిటల్‌ భద్రత, సాంకేతిక రక్షణ కల్పిస్తారు. స్మార్ట్‌కార్డు స్కాన్‌ చేస్తే నేరుగా దర్శనంతోపాటు ప్రసాదం పొందే వెసులుబాటు ఉంటుంది. తద్వారా క్యూలో వేచి ఉండే సమస్య ఉండదు. దర్శన వ్యవస్థలోనూ పారదర్శకత ఉంటుంది. ప్రాధికారకు ఆదాయం పెరుగుతుంది. రాజకీయ సిఫారసులకు బ్రేక్‌ పడుతుంది. వీటన్నింటితోపాటు క్యాష్‌లెస్‌ లావాదేవీలకు ప్రాధాన్యత అవకాశం ఉంటుంది. భక్తులకు అనుకూలంతోపాటు పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్మార్ట్‌కార్డు విధానం తీసుకురాదలిచామని, ఒకటి రెండు సమావేశాల్లో చర్చించి స్మార్ట్‌కార్డులపై పూర్తి వివరాలు ప్రకటిస్తామని చాముండేశ్వరి క్షేత్ర అభివృద్ధి ప్రాధికార కార్యదర్శి ఎంజే రూప తెలిపారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read LatestTelangana NewsandNational News

Updated Date - Sep 11 , 2024 | 01:42 PM

Advertising
Advertising