Bangalore: బాగేపల్లిలో ట్యాటూ స్వామి ప్రత్యక్షం
ABN, Publish Date - Nov 05 , 2024 | 02:21 PM
సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ట్యాటూ స్వామి(Tattoo Swami)గా పేరొందిన లక్ష్మీపతిస్వామి పట్టణానికి సోమవారం విచ్చేశారు. మైసూరు(Mysore) జిల్లా హుణసూరుకు చెందిన లక్ష్మీపతిస్వామి 2016 నుంచి హిందూ ధర్మంపై పాదయాత్రగా ప్రచారం చేస్తున్నారు. విశ్వశాంతి, సమాజంలో మార్పుకోసం ఆయన ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
బాగేపల్లి(బెంగళూరు): సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ట్యాటూ స్వామి(Tattoo Swami)గా పేరొందిన లక్ష్మీపతిస్వామి పట్టణానికి సోమవారం విచ్చేశారు. మైసూరు(Mysore) జిల్లా హుణసూరుకు చెందిన లక్ష్మీపతిస్వామి 2016 నుంచి హిందూ ధర్మంపై పాదయాత్రగా ప్రచారం చేస్తున్నారు. విశ్వశాంతి, సమాజంలో మార్పుకోసం ఆయన ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్(Karnataka, Andhra Pradesh, Kerala, Tamil Nadu, Uttar Pradesh) సహా 8 రాష్ట్రాల్లో పాదయాత్ర చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: CM Stalin: మా పాలన గొప్పతనం తెలుసుకోండి
ఉడుపి నుంచి ఆయన బాగేపల్లికి చేరుకున్నారు. పట్టణంలోని గంగమ్మదేవి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయన తన చేతులు, ఒంటిపై వివిధ దేవతల పచ్చబొట్లు వేసుకోవడం ద్వారా ట్యాటూ స్వామిగా పేరొందారు. ఇలా 35 ట్యాటూలు ఉన్నాయి. సూర్యచంద్రులు, వెంకటేశ్వరస్వామి, నరసింహ స్వామి, శివుడు, కాళికాదేవి, గరుడ, హనుమాన్, రంగనాథ్ తదితర దేవతల ట్యాటూలు ఉన్నాయి.
బెంగళూరు(Bangalore)కు చెందిన ట్యాటూ కళాకారుడి ద్వారా ట్యాటూ వేయించుకున్నట్టు ఆయన తెలిపారు. ట్యాటూ స్వామి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి, పురసభ మాజీ అధ్యక్షుడు బీఆర్ నరసింహ నాయుడు తదితరులు స్వామిని కలిసిన వారిలో ఉన్నారు.
ఈవార్తను కూడా చదవండి: మినరల్ కాదు.. జనరల్ వాటరే
ఈవార్తను కూడా చదవండి: 24 గంటల విద్యుత్ అంటూ మోసం: హరీశ్‌రావు
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్, హరీశ్ ఇళ్ల ముందు ధర్నా చేయండి
ఈవార్తను కూడా చదవండి: అసంక్రమిత వ్యాధులకు ప్రత్యేక క్లినిక్‌లు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 05 , 2024 | 02:21 PM