Bangalore: ఈ మంతనాల మర్మమేమిటో..? కాంగ్రెస్‌లో ఏదో జరుగుతోంది...
ABN, Publish Date - Aug 23 , 2024 | 11:07 AM
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతోంది. ‘ముడా’ అవినీతి కేసులో ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah)ను ప్రాసిక్యూషన్‌కు అనుమతులు ఇచ్చిన గవర్నర్‌పై మూకుమ్మడిగా నాయకులంతా తిరగబడ్డా ఈ మద్దతు ఎంతకాలమనేది చర్చలకు దారితీస్తోంది.
- డీకే శివకుమార్, సతీశ్ జార్కిహొళి భేటీపై సర్వత్రా చర్చ
- సిద్దూకు అండగా ఉంటారా..?
బెంగళూరు: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతోంది. ‘ముడా’ అవినీతి కేసులో ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah)ను ప్రాసిక్యూషన్‌కు అనుమతులు ఇచ్చిన గవర్నర్‌పై మూకుమ్మడిగా నాయకులంతా తిరగబడ్డా ఈ మద్దతు ఎంతకాలమనేది చర్చలకు దారితీస్తోంది. సీఎం సిద్దరామయ్యకు హైకోర్టు కల్పించిన పది రోజుల గడువు తాత్కాలిక ఉపశమనమేనా అన్న చర్చ జరుగుతోంది. కోర్టు కూడా ప్రాసిక్యూషన్‌కు సరే అంటూ సంకేతాలు ఇచ్చినా.. లేదా ఏ ఏజెన్సీ అయినా విచారణకు ముందుకెళ్లి కేసు నమోదు చేసినా.. అప్పుడు ఆయన వెంట ఉండేది ఎంతమంది అనే చర్చ కూడా సాగుతోంది.
ఇదికూడా చదవండి: Hero Vijay: ఇక ప్రజాసేవే లక్ష్యం..
ముఖ్యమంత్రి(Chief Minister) ప్రాసిక్యూషన్‌కు అనుమతులపై ఇండియా కూటమిలోని పార్టీలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ఈ విషయమై ప్రశ్నించినట్టు సమాచారం. మరికొన్ని రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కర్ణాటక(Karnataka) విషయానికి మద్దతు ఇవ్వలేమని కూడా తేల్చి చెప్పినట్టు సమాచారం. సిద్దరామయ్య స్థానానికి ఎవరిని ఎంపిక చేయాలనే చర్చ ఇప్పటికే పార్టీలో సాగుతున్నట్టు తెలుస్తోంది. గవర్నర్ నుంచి ప్రాసిక్యూషన్‌కు అనుమతులు వచ్చిన తర్వాత పలు అంశాలను సున్నితంగా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడుతోంది.
కొన్నేళ్లకాలంగా కాంగ్రెస్ లో బద్దశత్రువులుగా వ్యవహరించిన డీసీఎం డీకే శివకుమార్, మంత్రి సతీశ్‌జార్కిహొళి భేటీ కావడం కొత్త చర్చలకు దారితీస్తోంది. నెల రోజుల కిందటే సతీశ్‌జార్కిహొళిని మెంటల్ ఆసుపత్రికి పంపించాలని డీసీఎం మండిపడ్డారు. అంతలోనే వారు కుమారకృపలో భేటీ కావడం, కేవలం ఇద్దరే కొన్ని గంటలపాటు చర్చలు జరపడం కూడా కీలకమవుతోంది. కలబురగిలో పర్యటించిన డీసీఎం రాష్ట్రంలో మరో పదేళ్లపాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని వ్యాఖ్యానించారు. కానీ సిద్దరామయ్య సీఎంగా కొనసాగుతారనే విషయం మాట్లాడలేదు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాష్ట్రంలోని పరిస్థితులు సమగ్రంగా తెలుసు. గవర్నర్ జారీ చేసిన నోటీసు సరైనదా, తప్పా అని చెప్పలేనంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల ఖర్గే జన్మదినం రోజున ఆయన ఇంటివద్ద కాబోయే సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు. దీన్ని అర్థమేమిటో అన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. సిద్దరామయ్య ‘అహింద’ నేతగా ఎదిగినవారు. సామాన్య వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనవైపే ఉన్నారు. కానీ ఈ మద్దతు క్లిష్టసమయంలో కూడా కొనసాగుతుందా అనేది కీలకం కానుంది.
అధిష్టానం తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసి పనితీరు మార్చుకోకున్నా ప్రతిపక్షాల విమర్శలపై స్పందించకున్నా దసరా నాటికి విస్తరణ ఉంటుందనే అల్టిమేటం దేనికి సంకేతమనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి కేబినెట్, ఎమ్మెల్యేలు సీఎం సిద్దరామయ్యకు మద్దతు ఇస్తున్నా అగ్రనేతల్లో వ్యతిరేకించేవారు లేకపోలేదు. రాష్ట్ర కాంగ్రెస్‌లో దశాబ్దకాలంగా మూడు గ్రూపులు ఉన్నాయి. అందులో సిద్దరామయ్య, డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గేకు వారి అనుచరవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం, డీసీఎంకు ఎక్కువమంది మద్దతుదారులు ఉన్నారు. కానీ, సమస్య ఢిల్లీదాకా వెళ్తే ఖర్గే మాటకు విలువ ఉంటుంది.
అధిష్టానం తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసి పనితీరు మార్చుకోకున్నా ప్రతిపక్షాల విమర్శలపై స్పందించకున్నా దసరా నాటికి విస్తరణ ఉంటుందనే అల్టిమేటం దేనికి సంకేతమనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి కేబినెట్, ఎమ్మెల్యేలు సీఎం సిద్దరామయ్యకు మద్దతు ఇస్తున్నా అగ్రనేతల్లో వ్యతిరేకించేవారు లేకపోలేదు. రాష్ట్ర కాంగ్రెస్‌లో దశాబ్దకాలంగా మూడు గ్రూపులు ఉన్నాయి. అందులో సిద్దరామయ్య, డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గేకు వారి అనుచరవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం, డీసీఎంకు ఎక్కువమంది మద్దతుదారులు ఉన్నారు. కానీ, సమస్య ఢిల్లీదాకా వెళ్తే ఖర్గే మాటకు విలువ ఉంటుంది.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Aug 23 , 2024 | 11:39 AM