ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bangladesh : భారత్‌-బంగ్లా మధ్య నిలిచిన వాణిజ్యం

ABN, Publish Date - Aug 06 , 2024 | 04:12 AM

బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిణామాల ప్రభావం భారత్‌-బంగ్లాదేశ్‌ వాణిజ్యంపై పడుతోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు.

కోల్‌కతా, ఆగస్టు 5: బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిణామాల ప్రభావం భారత్‌-బంగ్లాదేశ్‌ వాణిజ్యంపై పడుతోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఆదివారం నాడే బంగ్లాదేశ్‌ ప్రభుత్వం మూడు రోజుల ట్రేడ్‌ హాలిడేను ప్రకటిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే అత్యవసర సర్వీసులను మాత్రం దీని నుంచి మినహాయించింది.

బంగ్లాదేశ్‌లోని లాండ్‌ పోర్ట్‌ల వద్ద ఆ దేశ కస్టమ్స్‌ నుంచి క్లియరెన్స్‌ లేకపోవడం వల్ల అన్ని లాండ్‌ పోర్టుల్లో ఎగుమతి, దిగుమతుల కార్యకలాపాలు నిలిచిపోయాయని పశ్చిమ బెంగాల్‌ ఎగుమతిదారుల కోఆర్డినేషన్‌ కమిటీ సెక్రటరీ ఉజ్జల్‌ సాహ తెలిపారు. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభం పట్ల భారత ఎగుమతిదారులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ద్వైపాక్షిక వాణిజ్యంపై ప్రభావం చూపుతాయంటున్నారు. అయితే త్వరలోనే పరిస్థితులు సద్దుమణుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాసియాలో బంగ్లాదేశ్‌.. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండగా.. ఆసియాలో బంగ్లాదేశ్‌కు భారత్‌ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.


పాక్‌లో ఇమ్రాన్‌పై కుట్ర

సైనిక పెత్తనానికి కేంద్రమైన పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ను పూర్తి కాలం పదవిలో కొనసాగనివ్వలేదు. ఉక్రెయిన్‌ యుద్ధం సమయంలో రష్యాలో పర్యటించిన ఆయనను పట్టుబట్టి మరీ తప్పించారు. దీనివెనుక అమెరికా హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. చివరకు ఇమ్రాన్‌ అనేక కేసులను ఎదుర్కొంటున్నారు. ఏడాదిన్నరగా జైల్లోనే ఉన్నారు. ఆయన బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.


అనూహ్యంగా మారిన నేపాలన

నేపాల్‌లో మొన్నటి వరకు ప్రచండ ప్రధానిగా ఉన్నారు. కానీ, గత నెల 12న జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. దీంతో ప్రచండ స్థానంలో కేపీ శర్మ ఓలీ ప్రధాని అయ్యారు. భారత్‌ వ్యతిరేకత కనబరిచే ఈయన 2021కి ముందు వరకు రెండుసార్లు ప్రఽధానిగా పనిచేశారు. మరోవైపు, మయన్మార్‌లో సైనిక పెత్తనం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రజాస్వామ్యం కోసం పోరాడిన సూచీని జైలుకు పంపిన మయన్మార్‌ సైనిక పాలకులు దేశంపై తమ పట్టును బిగించారు.


లంకలో కల్లోలం

ధరల పెరుగుదల, అంతులేని అవినీతి, కుటుంబ పెత్తనంతో సరిగ్గా రెండేళ్ల కిందట శ్రీలంకలో ప్రజలు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మీద తిరుగుబాటు చేశారు. రోజుల తరబడి ఆందోళనలు సాగించారు. చివరకు గొటబాయ అఽధికారిక నివాసంలోకి చొరబడి నానా బీభత్సం సృష్టించారు. ఈ ఆగ్రహాన్ని చూసిన రాజపక్స దేశం విడిచిపారిపోయారు.


బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్‌ చిచ్చు

బంగ్లాదేశ్‌లో స్వాతంత్య్ర సమరయోధుల పిల్లలకు రిజర్వేషన్లపై మొదలైన నిరసనలు చివరికి ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా రాజీనామాకు దారి తీశాయి. బంగ్లాదేశ్‌ హసీనా హయాంలో ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందింది. అయితే, విపరీతమైన అవినీతి, ద్రవ్యోల్బణం, రాజకీయ ఏకస్వామ్యం, నిర్బంధ విధానాలతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది.

Updated Date - Aug 06 , 2024 | 04:12 AM

Advertising
Advertising
<