ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Border: భారత సరిహద్దుల్లో బంగ్లాదేశ్ డ్రోన్స్.. దాడి కోసమేనా..

ABN, Publish Date - Dec 06 , 2024 | 01:25 PM

పశ్చిమ బెంగాల్ సమీపంలో బంగ్లాదేశ్ టర్కీ నిర్మిత డ్రోన్‌లను మోహరించినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో నిఘాను పెంచింది. అయితే ఎందుకు డ్రోన్లను అక్కడ మోహరించారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Bangladesh Turkey TB2

భారత్‌(india), బంగ్లాదేశ్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. అందుకు బంగ్లాదేశ్ (Bangladesh) ఆర్మీ పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో బైరక్టార్ TB-2 కిల్లర్ డ్రోన్‌ను మోహరించడమేనని చెప్పవచ్చు. బంగ్లాదేశ్ ఆర్మీ మోహరింపుతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగింది. ఈ ప్రాంతం భారతదేశంలో చాలా సున్నితమైనదిగా పరిగణించబడుతుంది. టర్కియే TB-2 డ్రోన్ చాలా శక్తివంతమైనది. ఇది దాడి చేయడమే కాకుండా, గూఢచర్యం చేయడంలో కూడా సహాయపడుతుంది. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.


కారణమిదేనా..

ఈ డ్రోన్‌లను బంగ్లాదేశ్‌లో 67వ సైన్యం నిఘా కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారని చెబుతున్నారు. బంగ్లాదేశ్ రక్షణ అవసరాల కోసం మోహరింపు అని చెప్పినప్పటికీ, ఆధునాతన డ్రోన్‌లను సున్నితమైన ప్రాంతంలో ఉంచడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరతను ఉపయోగించుకుని పలు ఉగ్రవాద గ్రూపులు, స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు భారత్‌లోకి చొరబడుతున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. హసీనా బహిష్కరణ తరువాత, సరిహద్దు ప్రాంతాలలో భారతదేశ వ్యతిరేక అంశాలు కూడా పెరిగాయి. దీంతోపాటు రాజకీయ అస్థిరత నేపథ్యంలో భారత సరిహద్దుల దగ్గర అధునాతన UAV విస్తరణ, అధిక నిఘా అవసరమని ఓ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి పేర్కొన్నారు.


భారత్ అప్రమత్తం..

బంగ్లాదేశ్‌లో అశాంతి నేపథ్యంలో భారత సాయుధ దళాలు ఇప్పటికే అప్రమత్తం అయ్యాయి. సరిహద్దుల్లో తాజా డ్రోన్ విస్తరణలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాలలో కౌంటర్ డ్రోన్ కార్యకలాపాలను కూడా తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో పరిస్థితిని తెలుసుకునేందుకు భారతదేశం గూఢచార భాగస్వామ్య యంత్రాంగాలను కూడా ఉపయోగిస్తోంది. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలపై తాము అప్రమత్తం అయ్యామని భారత అధికారులు చెబుతున్నారు.


ఈ దేశాల్లో కూడా

రక్షణ వ్యవహారాల వెబ్‌సైట్ ITRW భారత సరిహద్దు సమీపంలో TB2 డ్రోన్‌ని మోహరించడం గురించి సమాచారాన్ని ఇచ్చింది. సోషల్ మీడియాలో ఇలాంటి అనేక పోస్ట్‌లు వెలుగులోకి వచ్చాయి. అందులో భారత సరిహద్దు సమీపంలో TB 2 మోహరించబడిందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ Türkiye నుంచి 12 TB-2 డ్రోన్‌లను కొనుగోలు చేసింది. వాటిలో ఇప్పటికే 6 అందుకుంది. ఈ డ్రోన్‌లను ఇప్పుడు బంగ్లాదేశ్ వైమానిక దళం ఎగురవేస్తోంది. వీటిని సరిహద్దులో గూఢాచర్యం, నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. బంగ్లాదేశ్‌తో పాటు ఈ కిల్లర్ డ్రోన్‌ను భారతదేశం, మరో రెండు పొరుగు దేశాలైన పాకిస్తాన్, మాల్దీవులు కూడా కొనుగోలు చేశాయి.


ప్రతిదీ నాశనం

పాకిస్తాన్ ఇటీవల తన స్వదేశీ బురాక్ ఎయిర్‌ను ఉపరితల క్షిపణిని బైరక్టార్ TB2 డ్రోన్‌కు అమర్చింది. ఈ డ్రోన్‌ను ప్రపంచంలోని 33 కంటే ఎక్కువ దేశాలు ఉపయోగిస్తున్నాయి. ఈ డ్రోన్ ఉక్రెయిన్ నుంచి అర్మేనియా, అజర్‌బైజాన్ వరకు జరిగిన యుద్ధాలలో తన బలాన్ని నిరూపించుకుంది. ఆ తరువాత బంగ్లాదేశ్ సైన్యం కూడా ఈ TB2 డ్రోన్ కోసం టర్కీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై సంతకం చేసినప్పుడు, ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రధానిగా ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

Supreme Court: సుప్రీంకోర్టు ఆదేశం.. స్కూళ్లు మళ్లీ ఫిజికల్‌గా ప్రారంభం


Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు

Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..


Bitcoin: మొదటిసారి లక్ష డాలర్లు దాటిన బిట్‌కాయిన్.. కారణమిదేనా..


Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..


Read More National News and Latest Telugu News

Updated Date - Dec 06 , 2024 | 01:44 PM