Viral Video: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశం.. వీడియోలో వివరించిన యూట్యూబర్ ?
ABN, Publish Date - Jul 28 , 2024 | 03:51 PM
ఒక దేశం నుంచి మరో దేశానికి ఎవరైనా వెళ్లాలంటే.. వీసా, పాస్ పోర్ట్, గుర్తింపు కార్డు, అధికారిక పత్రాలు ఉండాలి. అయితే ఇవేమి లేకుండా ఎవరు.. మరో దేశానికి వెళ్లడానికి వీలు ఉండదు. వీలు పడదు. అయితే ఇవేమీ లేకుండా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ఎలా ప్రవేశించ వచ్చునో ఓ యూట్యుబర్ వివరించాడు.
ఒక దేశం నుంచి మరో దేశానికి ఎవరైనా వెళ్లాలంటే.. వీసా, పాస్ పోర్ట్, గుర్తింపు కార్డు, అధికారిక పత్రాలు ఉండాలి. అయితే ఇవేమి లేకుండా ఎవరు.. మరో దేశానికి వెళ్లడానికి వీలు ఉండదు. వీలు పడదు. అయితే ఇవేమీ లేకుండా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ఎలా ప్రవేశించ వచ్చునో ఓ యూట్యుబర్ వివరించాడు.
బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యూట్యూబర్.. డిహెచ్ ట్రావెలింగ్ ఇన్ఫో పేరిట ఓ యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తున్నాడు. ఎటువంటి పత్రాలు లేకుండా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ఎలా వలస వెళ్ల వచ్చునో అతడు.. తన వీడియోలో కళ్లకు కట్టినట్లు వివరించాడు. అయితే ఈ వీడియో.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోపై నెటిజన్లు మాత్రం ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు.
Rahul Gandhi: సివిల్స్ ఆశావహులు మృతి.. మూల్యం చెల్లించుకుంటున్న సామాన్యుడు
సిల్హెట్ డివిజన్ నుంచి..
బంగ్లాదేశ్, సునంగంజ్ జిల్లాలోని సిల్హెట్ డివిజన్‌లో నిలిచి సదరు యూట్యూబర్.. భారత్‌లోనికి ఎలా ప్రవేశించ వచ్చో ఈ వీడియోలో చూపించారు. ఈ రహదారి వెంట వెళ్లితే.. భారత్‌లోకి వెళ్లిపోతామని అతడు వివరించాడు. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించే క్రమంలో ఈ మార్గం ఎంచుకున్న వారు.. సరిహద్దు భద్రతా సిబ్బంది (బీఎస్ఎఫ్)కి చిక్కితే మాత్రం తదనంతర పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. అలాగే భారత్ భూభాగంలోని బీఎస్ఎఫ్ శిబిరాన్ని సైతం అతడు తన వీడియోలో చూపించాడు. అయితే అతడు చెప్పాల్సిందంతా ఈ వీడియోలో చెప్పేశాడు.
బంగ్లాదేశీయులకు కీలక సూచన..
కానీ చట్ట విరుద్దంగా భారత్‌లోకి ప్రవేశించ వద్దంటూ బంగ్లాదేశీయులకు ఈ సందర్భంగా విజ్జప్తి చేశాడు. అలా భారత్‌లోకి ప్రవేశించడం ద్వారా మన దేశం పేరు చెడగొట్ట వద్దంటూ బంగ్లాదేశీయులకు సూచించాడు. మరోవైపు ఈ వీడియోను.. యూట్యూబర్ చాలా కాలం క్రితం చేశాడు. దీనిని ఇటీవల అంటే జులై 26న మళ్లీ సోషల్ మీడియాలోకి వదిలాడు. ఈ వీడియోను ఇప్పటి వరకు 2 లక్షల మంది వీక్షించారు. అలాగే 7 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.
నెటిజన్ల అభిప్రాయం..
దాంతో ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో విమర్శలు చేశారు.. చేస్తున్నారు. యూట్యూబర్ ఇంత చేస్తుంటే.. భారత్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దు వద్దనున్న బీఎస్‌ఎఫ్ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వారు నిద్ర పోతున్నారా? అంటూ వారికి నెటిజన్లు చురకలంటించారు.
మరో నెటిజన్ అయితే.. ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకున్నాడు. తన స్నేహితుడు మేఘాలయాలో ఉంటాడన్నాడు. అతడి పిన్ని వారానికి ఒక సారి బంగ్లాదేశ్ వెళ్లి సరుకులు తీసుకు వస్తుందని సోదాహరణగా వివరించాడు. ఇరు దేశాల మధ్య సరిహద్దుల ఉంటే.. ఇదంతా సామాన్యమైన విషయమని మరో నెటిజన్ వివరించాడు.
ఇంకో నెటిజన్ అయితే.. అతడు ఇలా వీడియోను చూపించడం వల్ల.. దేశ సరిహద్దు ప్రాంతాలను బలోపేతం చేయవచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే కొన్ని దేశాలకు వీసా, పాస్ పోర్ట్‌లు ఇవేమీ లేకుండా.. ఒక్క గుర్తింపు కార్డుతో కొన్ని దేశాలు చుట్టేయ వచ్చని మరో నెటిజన్ వివరించాడు.
Read More National News and Latest Telugu News
Updated Date - Jul 28 , 2024 | 04:50 PM