పోలింగ్ బూత్‌ల్లో సెల్‌ఫోన్ల నిషేధం సరైనదే
ABN, Publish Date - Nov 19 , 2024 | 01:51 AM
పోలింగ్ బూత్‌ల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకొని రాకూడదంటూ ఎన్నికల కమిషన్(ఈసీ) ఇచ్చిన ఆదేశాల్లో చట్టవ్యతిరేకత ఏమీ లేదని సోమవారం బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
ముంబయి, నవంబరు 18: పోలింగ్ బూత్‌ల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకొని రాకూడదంటూ ఎన్నికల కమిషన్(ఈసీ) ఇచ్చిన ఆదేశాల్లో చట్టవ్యతిరేకత ఏమీ లేదని సోమవారం బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు సజావుగా సాగేందుకు నిబంధనలు రూపొందించే అధికారం ఈసీకి ఉందని తెలిపింది. డిజీలాకర్ యాప్ ద్వారా తన గుర్తింపు కార్డును చూపిస్తానని, అందువల్ల మొబైల్ ఫోన్లను బూత్‌ల్లోకి వాటిని అనుమతించకపోవడం చట్టవ్యతిరేకమని పేర్కొంటూ ఉజలా యాదవ్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్‌ను కోర్టు కొట్టేసింది.
Updated Date - Nov 19 , 2024 | 01:53 AM