డిజిటల్ అరెస్ట్ పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు రూ.11.8 కోట్లు టోకరా
ABN, Publish Date - Dec 24 , 2024 | 06:51 AM
ఆధార్ కార్డును మనీలాండరింగ్ కోసం దుర్వినియోగం చేశాడని బెదిరిస్తూ బెంగళూరుకు చెందిన ఓ టెకీ నుంచి రూ.11.8 కోట్లు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. నవంబరు 11న బాధితుడికి
బెంగళూరు, డిసెంబరు 23: ఆధార్ కార్డును మనీలాండరింగ్ కోసం దుర్వినియోగం చేశాడని బెదిరిస్తూ బెంగళూరుకు చెందిన ఓ టెకీ నుంచి రూ.11.8 కోట్లు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. నవంబరు 11న బాధితుడికి మొదటిసారి వచ్చిన ఫోన్‌కాల్‌లో ట్రాయ్ అధికారినంటూ ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. బాధితుడి ఆధార్‌కార్డుకు లింక్ అయిన సిమ్ కార్డును అసాంఘిక అడ్వర్‌టైజ్‌మెంట్లకు వాడారని, ముంబైలోని కొలాబా సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్ అయిందని, వర్చువల్ ఇన్వెస్టిగేషన్‌కు సహకరించకపోతే నేరుగా వచ్చి అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. ఆ తర్వాత స్కైప్ వీడియోకాల్‌లో ముంబై పోలీస్ యూనిఫామ్ ధరించిన వ్యక్తి బాధితుడి ఆధార్ కార్డు ద్వారా తెరిచిన బ్యాంక్ అకౌంట్ ద్వారా రూ.6 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఎఫ్‌ఐఆర్ నమోదైందని అబద్ధాలు చెప్పాడు. నవంబర్ 25న నిందితులు బాధితుడిని డిజిటల్ అరెస్ట్ చేశామని చెప్పి అతడి అకౌంట్ నుంచి తమ అకౌంట్లలోకి రూ.11.8కోట్లు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో అనుమానం వచ్చిన టెకీ చివరకు పోలీసులను ఆశ్రయించి జరిగింది చెప్పి భోరుమన్నాడు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Updated Date - Dec 24 , 2024 | 06:51 AM