ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hathras Stampede: 'జరగాల్సింది ఎవరూ ఆపలేరు, వెళ్లే టైం వస్తే పోవాల్సిందే'.. భోలే బాబా ప్రవచనాలు

ABN, Publish Date - Jul 18 , 2024 | 02:47 PM

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్‌లో(Hathras Stampede) జరిగిన తొక్కిసలాట ఘటనకు పరోక్షంగా కారణమైన భోలే బాబా(Bhole Baba) గురువారం మీడియా ముందుకు వచ్చాడు. హత్రాస్ (Hathras) తొక్కిసలాటలో 121 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఘటన జరిగిన15 రోజుల తరువాత భోలేబాబా కాస్ గంజ్‌లో ఉన్న ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్‌లో(Hathras Stampede) జరిగిన తొక్కిసలాట ఘటనకు పరోక్షంగా కారణమైన భోలే బాబా(Bhole Baba) గురువారం మీడియా ముందుకు వచ్చాడు. హత్రాస్ (Hathras) తొక్కిసలాటలో 121 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఘటన జరిగిన15 రోజుల తరువాత భోలేబాబా కాస్ గంజ్‌లో ఉన్న ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడారు.

"హాథ్రస్ తొక్కిసలాట ఘటన నన్ను ఎంతో బాధించింది. కానీ జరగాల్సింది ఎవరూ ఆపలేరు కదా. వచ్చిన వారు ఏదో ఒకరోజు వెళ్లిపోవాల్సిందే. ఏ సమయమో మనం అంచనా వేయలేం. విషపూరిత స్ప్రే గురించి మా న్యాయవాది, ప్రత్యక్ష సాక్షులు చెప్పింది నిజమే. ఘటన వెనుక ఏదో కుట్ర దాగి ఉన్న విషయం వాస్తవం. సనాతన ధర్మంపై నడిచే మా సంస్థ పరువు తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. సిట్‌, న్యాయకమిషన్‌పై మాకు పూర్తి విశ్వాసం ఉంది. త్వరలోనే నిజాలు బయటకి వస్తాయి. బాధిత కుటుంబాలందరికీ అండగా ఉంటాం. నేను ఎక్కడికీ పారిపోలేదు. నేను పుట్టిన కాస్‌గంజ్‌లోని బహదుర్​నగర్‌లోనే ఉంటున్నా' అని భోలే బాబా చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై ప్రజలు మండిపడుతున్నారు.


భోలే బాబా పారిపోలేదు..

భోలే బాబా న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ.. 'భోలే బాబా కాస్​గంజ్‌లోని తన ఆశ్రమానికి తిరిగి వచ్చారు. ఇక్కడే ఉంటారు. విదేశాల్లో, హోటల్‌ల్లో ఆయన దాక్కోలేదు. ఆయన మరో ఆశ్రమానికి వెళ్లి వచ్చారు' అని తెలిపారు. అయితే హత్రాస్ తొక్కిసలాట ఘటనపై యూపీ సర్కార్ వేసిన సిట్ దీని వెనక కుట్ర కుణం ఉందనే అనుమానం లేవనెత్తింది. తొక్కిసలాటకు స్థానిక యంత్రాంగం తప్పిదమే కారణంగా ఎత్తి చూపింది.


కన్యలతో నగ్న స్నానాలు..

121 మంది మరణాలకు కారణమైన భోలే బాబా జీవితానికి సంబంధించి విస్తుపోయే నిజాలు బయటకి వస్తున్నాయి. భోలే బాబా చుట్టూ కన్య పిల్లలు ఎరుపు రంగు దుస్తులు ధరించి భోలే బాబాకు నగ్నంగా స్నానం చేయిస్తారట. అంతేకాదు కన్య పిల్లలు తినిపిస్తేనే భోజనం చేసి, వారు పక్కనుంటేనే నిద్రిస్తారట భోలే భాబా. ఇక పెళ్లైన వారిని తన దగ్గరికి రానివ్వడట. పెళ్లైన స్త్రీలు కనీసం తన ఆశీస్సులు తీసుకునేందుకు కూడా అనుమతించరని స్థానికులు అంటున్నారు. దీనికితోడు విలాసవంతమైన భవనాలతో పటిష్ట భద్రత నడుమ భోలే బాబా ఆస్తులు ఉన్నాయి. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.100 కోట్లకుపైనే ఉంటుందని భోగట్టా.

For Latest News and National News click here

Updated Date - Jul 18 , 2024 | 02:51 PM

Advertising
Advertising
<