ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anti-Paper Leak Bill: నీట్ పేపర్ లీక్ వివాదం.. బిహార్ ప్రభుత్వం కీలక బిల్లు.. రూ.10 లక్షలతో సహా జైలు శిక్ష

ABN, Publish Date - Jul 24 , 2024 | 04:37 PM

నీట్ పేపర్ లీక్ వ్యవహారం ఎంత పెద్ద దుమారానికి తెరలేపిందో అందరికీ తెలిసిందే. కొందరు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ రావడంపై అనుమానాలు రేకెత్తెడంతో.. విద్యార్థులంతా ఆందోళనలు చేపట్టారు. ఈ వివాదం సుప్రీంకోర్టు..

Anti-Paper Leak Bill

నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak Issue) వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత పెద్ద దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. కొందరికి ఫస్ట్ ర్యాంక్ రావడంపై అనుమానాలు రేకెత్తెడంతో.. విద్యార్థులంతా ఆందోళనలు చేపట్టారు. ఈ వివాదం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలోనే.. పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు, ప్రభుత్వ నియామక పోటీ పరీక్షల్లో అవకతవకల్ని నియంత్రించేందుకు గాను.. బిహార్ (Bihar) ప్రభుత్వం ఒక కీలకమైన బిల్లును తీసుకొచ్చింది. బుధవారం దీనికి అసెంబ్లీలో ఆమోదం కూడా లభించింది.

తొలుత రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి సభలో ‘బిహార్ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) బిల్లు-2024’ను (The Bihar Public Examinations (PE) (Prevention of Unfair Means) Bill-2024) ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలు వాకౌట్ చేయడంతో.. మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది. నీట్‌-యూజీ పేపర్ లీక్ వివాదంలో బిహార్ కేంద్ర బిందువుగా ఉన్న తరుణంలో.. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లుని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఈ బిల్లు ప్రకారం.. ఆయా పరీక్షల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే, వారికి రూ.10 లక్షల జరిమానాతో పాటు మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు.


నీట్ పేపర్ లీక్ వివాదం

ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో నీట్-యూజీ ప్రవేశ పరీక్షను నిర్వహించడం జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. అయితే.. ఎన్నడూ లేని విధంగా 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడంతో అనుమానాలు రేకెత్తాయి. అంతమంది ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందంటూ విద్యార్థులకు ఆందోళనకు దిగారు. కచ్ఛితంగా పేపర్ లీక్ అయ్యిందంటూ నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్లు దాఖలు అవ్వగా.. రీఎగ్జామ్ అవసరం లేదంటూ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది.

నీట్ పేపర్ లీకైందన్న మాట వాస్తవమే గానీ.. సిస్టమిక్ పేపర్ లీకేజీని నిరూపించేందుకు తగిన సాక్ష్యాలు లేవని సుప్రీంకోర్టు తెలిపింది. పేపర్‌ లీక్‌ ద్వారా 155 మంది లబ్ధి పొందారని.. కాపీ కొట్టిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. నీట్‌ను రద్దు చేస్తే 24 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని, కాబట్టి మరోసారి నీట్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. నీట్ నిర్వహణలో లోపాలున్నాయని, నీట్‌పై అభ్యంతరాలను ఆగస్టు 21న వింటామని చెప్పుకొచ్చింది. దీంతో.. నీట్ కౌన్సిలింగ్ యథావిధిగానే కొనసాగనుంది.

Read Latest National News and Telugu News

Updated Date - Jul 24 , 2024 | 04:37 PM

Advertising
Advertising
<