ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

National News: తలపాగా తొలగించిన డిప్యూటీ సీఎం.. శ్రీరాముడికి అంకితం..

ABN, Publish Date - Jul 03 , 2024 | 11:59 AM

బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరి తన తలపాగాను ఎట్టకేలకు తొలగించారు. 2022లో తలపాగా ధరించిన చౌదరి దాదాపు 22 నెలల తర్వాత తన తలపాగాను తొలగిస్తూ.. శ్రీరాముడికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

Samrat Choudhary

బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరి తన తలపాగాను ఎట్టకేలకు తొలగించారు. 2022లో తలపాగా ధరించిన చౌదరి దాదాపు 22 నెలల తర్వాత తన తలపాగాను తొలగిస్తూ.. శ్రీరాముడికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. అయోధ్యలోని సరయూ నదిలో స్నానం చేసి.. తన తలపాగాను తొలగించి హనుమాన్ గర్హి ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా సామ్రాట్ చౌదరి అనుచరులు, అభిమానులు భారీగా చేరుకుని.. జై శ్రీరామ్ నినాదాలు చేశారు. సామ్రాట్ చౌదరి తలపాగా ధరించడం వెనుక ఓ స్టోరీ ఉంది. బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్ ఎన్డీయేను వీడి ఇండియా కూటమిలో కలవడాన్ని నిరసిస్తూ చౌదరి తలపాగా ధరించారు. దీంతో నితీష్‌ను సీఎంగా గద్దె దింపిన తర్వాతనే తలపాగా తొలగిస్తానని సామ్రాట్ చౌదరి ప్రతిజ్ఞ చేశారు.

Floods: వరదల ఎఫెక్ట్.. 38కి చేరిన మృతులు


సామ్రాట్ చౌదరి ఏమన్నారంటే..

నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేంత వరకు తలపాగా ధరిస్తానని ప్రతిజ్ఞ చేశానని.. కానీ ప్రస్తుతం ఆయన ఇండియా కూటమి నుంచి ఎన్డీయే కూటమిలో చేరారని.. ఈక్రమంలో తాను తలపాగను తొలగించాల్సిన సమయం వచ్చిందన్నారు. నితీష్ కుమార్ ఇండియా కూటమిని వదిలి.. ఎన్డీయేలో చేరిన రోజు తన తలపాగాను రాముడికి అంకితం చేస్తానని ప్రకటించానని.. దాని ప్రకారం అయోధ్యలో శ్రీరాముడికి తలపాగాను అంకితం చేసినట్లు తెలిపారు.

PM Narendra Modi: అబద్ధాలు.. పిల్లచేష్టలు!


ఇండియా కూటమితో విభేదాలు ఏర్పడిన తర్వాత నితీష్ కుమార్ ఈ ఏడాది జనవరిలో తిరిగి ఎన్డీయే కూటమిలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ పొత్తులో భాగంగా పోటీచేశాయి. గత పదేళ్ల కాలంలో ఆయన ఐదు సార్లు కూటములు మార్చారు. ఇండియా కూటమి నుంచి నితీష్ బయటకు రావడంతో బీహార్‌లో మహాఘటబంధన్ ప్రభుత్వం పతనానికి దారితీసింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడింది. ఉప ముఖ్యమంత్రులుగా బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ప్రమాణ స్వీకారం చేశారు. సామ్రాట్ చౌదరి అధికారపక్షంలోకి రావడంతో పాటు.. నితీష్ ఇండియా కూటమి నుంచి బయటకు రావడంతో ఆయన తన తలపాగాను తొలగించారు.


Hathras: హత్రాస్‌ తొక్కిసలాట ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం.. నేడు సీఎం కూడా..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 03 , 2024 | 11:59 AM

Advertising
Advertising